రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. రూ.17,000 కోట్లు విలువైన లోన్ మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబుకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేదీన హైదరాబాదులోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ చెందిన సాయి సూర్య డెవలపర్స్ తో పాటు సురానా గ్రూపు కంపెనీ వ్యవహారంలో ఈడీ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ కోసం మహేశ్ బాబు ప్రమోషన్ నిర్వహించాడు. ఇందు కొరకు రూ. 5.9 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇందులో కొంత…
ఫార్ములా ఈ-రేసు కేసులో జనవరి 7న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసు ఇచ్చింది. నేడు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ మెయిల్ పంపారు. హైకోర్టుపై ఉన్న గౌరవంతో.. తీర్పు వచ్చేంత వరకు సమయం ఇవ్వాలని విన్నవించారు. అయితే కేటీఆర్ విజ్ఞప్తిపై ఈడీ అధికారులు స్పందించింది. విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
KTR: ఈడీ ద్వారా నోటీస్ వచ్చింది..దానిలో ఏమి అనుమానం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేపు కోర్టు లో చెబుతాం.. ఏ కేసులో దూకుడుగా లేని ఈడీ... ఈ కేసులో మాత్రం అత్యుత్సాహం చూపిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఈడీ నోటీసులపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. కేటీఆర్ ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఖర్చు చేసిన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు ఆర్బీఐకి చెప్పకుండా మన రాష్ట్ర సొమ్ముని దేశ ఫారెన్ కంపెనీల కోసం ఖర్చు పెట్టారని రఘునందన్ రావు ఆరోపించారు.
Bhoodan Land Scam: భూదాన్ భూముల స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాగర్‌కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆమోద డెవలపర్స్‌కి చెందిన సూర్య తేజతో పాటు కె.ఎస్.ఆర్ మైన్స్ కు చెందిన సిద్ధారెడ్డి ఈ స్కామ్ లో లాభ పడినట్లు ఈడీ గుర్తించింది. ఇస్కాన్ లో ఇప్పటికే ఐఏఎస్ అమోయ్ కుమారును పలుమార్లు విచారించింది. తాజాగా నలుగురికి నోటీసులు జారీ చేసింది.…
ED Notice to Malla Reddy:మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. మల్లారెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలు పై నోటీసులు ఇచ్చినట్లు ఈడీ పేర్కింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చింది. గతంలోనూ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు విచారణకు హాజరుకావాలని నోటీసులకు ఎమ్మెల్సీ కవిత సెటైరికల్ రెస్పాన్స్ ఇచ్చారు.
ఈడీ బోడిలకు భయపడేది లేదు అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఏం జరిగినా దేశం అగ్నిగుండమేనంటూ ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ని రాజకీయంగా తట్టుకోలేకే ఈ డ్రామాలు.. మహిళా బిల్లు కోసం దేశం అంత మద్దతు కోసం కవిత లేఖలు రాస్తే చూడలేకే.. ఈడీ ఈ నోటీసులు ఇచ్చింది.