ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులే.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అంటూ ఆయన ఆరోపించారు.
Once again ED notices for Mmelsi Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు (సెప్టెంబర్ 15) విచారణకు హాజరు కావాలని తాజాగా సమన్లు జారీ చేసింది.
Gangula Kamalakar: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గంగుల కుటుంబానికి చెందిన వైట్ గ్రానైట్‌లు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
Malla Reddy: మెడికల్ కాలేజీల్లో సీట్ల కుంభకోణంపై ఈడీ అధికారులు విచారణను ముమ్మరం చేయనున్నారు. 2016 నుంచి 2022 వరకు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు గత నెలలో రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి..
Anjan kumar: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసు చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ మరో సారి ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో అంజన్ కుమార్ ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు సమచారం. గతంలో ఈడీ విచారణకు అంజన్ కుమార్ హాజరైన విషయం…
Chikoti Praveen : క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ నేడు ఈడీ ఎదుట హాజరయ్యాడు. క్యాసినో కేసులో ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని.. చికోటి ప్రవీణ్‌పై గతంలో ఈడీ కేసు నమోదు చేసింది. తాజాగా.. థాయిలాండ్ ఘటన నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చింది.
Chikoti Praveen: చీకోటి ప్రవీణ్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్‌ను గతంలో ప్రశ్నించిన ఈడీ.. ఇవాల మరోసారి నోటీసులు జారీ చేసింది. తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన ఘటన తర్వాత చికోటీకి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.
లిక్కర్ స్కామ్ లో లెఫ్టనెంట్ గవర్నర్ బీజేపీ నాయకుడి తో ప్రెస్ మీట్ పెట్టించారని, కేంద్రం తప్పులను కప్పిపుచ్చడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారని నిజామాబాద్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు.
ఇవాళ బీఆర్‌ఎస్ఎ మ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్ పాత బస్తి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. బెంగుళూరు డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చాయని అంటున్న బండి సంజయ్ కు సవాల్ విసిరారు.