Delhi Liquor Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చింది. గతంలోనూ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. ఈడీ విచారణపై గతంలో కవిత కోర్టును ఆశ్రయించింది.
Read Also: TSSPDCL: పవర్ కట్ విషయంలో ఏరియా వారీగా కంట్రోల్ రూమ్
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్‌కు సంబంధించిన వ్యవహారాల్లో కవిత లీడ్ చేశారని ఈడీ ఆరోపిస్తోంది. అంతే కాకుండా అప్రూవర్‌గా మారిన అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా చేసుకుని కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన ఇప్పటివరకు ఈడీ విచారణకు హాజరుకాలేదు. తాజాగా కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి విదతమే. ఈ వారమే ఆయన విచారణ కూడా ఉంది. మొత్తానికి రేపటి విచారణకు కవిత హాజరవుతారా.. లేదా అనేది ఆమె నుంచి ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇప్పుడు అందిన నోటీసులకు సంబంధించి ఆమె ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.