తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో, ఆహర సంక్షోభంలో చిక్కుకుంది ద్వీపదేశం శ్రీలంక. గత కొన్ని నెలల నుంచి శ్రీలంక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. స్వాతంత్ర్యం పొందిన 1948 నుంచి ఇప్పుడే అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. ఇటీవల నిరసనలు హింసాత్మకంగా మారడంతో చివరకు ప్రధాని గా ఉన్న మహిందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రధానిగా రణిల్…
ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడిపోతోంది. ప్రజలు నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో మహిందా రాజపక్సే తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల కారణంగా ఆర్మీ ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించింది. ఇదిలా ఉంటే గురువారం కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఐదు సార్లు ప్రధానిగా చేసిన అనుభవం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి శ్రీలంకను బయటపడేస్తారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ ప్రధాని మహిందా రాజపక్సేకు కోర్ట్…
శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రణిల్ విక్రమసింఘే చేత ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకను విషమ పరిస్థితుల నుంచి బయటపడేసే బాధ్యత ప్రస్తుతం రణిల్ విక్రమసింఘేపై ఉంది. ఇటీవల శ్రీలంకలో నిరసనలు తీవ్రమై హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని పదవిలో ఉన్న మహిందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త ప్రధాని ఏర్పాటు అనివార్యమైంది. బుధవారం దేశప్రజలను…
శ్రీలంక దేశం రావణకాష్టంగా మారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ద్వీప దేశం అల్లాడుతోంది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసరాల ధరలు ఘోరంగా పెరిగాయి. దీంతో ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. దీంతో గత కొన్ని నెలలుగా ఆ దేశంలో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయితే తాజాగా ఈ ఘటనలు హింసాత్మకంగా మారాయి. పలువురు మరణించడంతో పాటు 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోతున్న తరుణంలో ప్రధాని…
ఆఫ్ఘనిస్తాన్ దుర్భర పరిస్థితులను అనుభవిస్తోంది. తాలిబాన్ పాలనలో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది ఆగస్టు 15న ప్రధాని ఆష్రఫ్ ఘనీ పౌరప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు వారి పాలనను తీసుకువచ్చారు. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ ను వదిలిన తర్వాత అక్కడ ప్రజలకు తాలిబన్లు చుక్కలు చూపిస్తున్నారు. తలతిక్క నిర్ణయాలతో ఆడవారిని ఇంటికే పరిమితం చేయడం, స్త్రీలను విద్యకు, ఉద్యోగానికి దూరం చేశారు. కఠినంగా షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్…
ద్వీప దేశం శ్రీలంక రగులుతోంది. మొత్తం దేశం రావణకాష్టంలా మారుతోంది. తీవ్రమైన ఆర్థిక, ఆహారం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పూర్తిగా చెప్పాలంటే రాజపక్సే ప్రభుత్వం శ్రీలంకను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. దీంతో పాటు అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర ఆహార కొరతకు కారణం అయ్యాయి. మరోవైపు ఆర్థిక పరిస్థితికి మించి విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి అప్పులు తీసుకుంది. అప్పులు చెల్లించలేక హంబన్ టోటా రేవును చైనాకు లీజుకు ఇచ్చింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ప్రధాని…
తీవ్ర ఆర్థిక, ఆహారం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి. ఆందోళనకారుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. శ్రీలంకలో నిన్నటి నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 7 మంది మరణించారు. 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 260 మందికి తీవ్రగాయాలు కాగా… ఐసీయూలో 60 మంది చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురు టూరిస్టులు కూడా ఉన్నారు. ఇప్పటికే మహిందా రాజపక్సే తన ప్రధానికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల వల్ల మహిందా…
శ్రీలంకలో పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే కూడా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత ప్రజలు ఆందోళన బాట పట్టారు. నిరసనకారులు రాజధాని కొలంబోలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, మాజీ ప్రధాని మహిందా రాజపక్సే అధికారిక నివాసాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే నిన్న ప్రధానిగా మహిందా రాజపక్సే రాజీనామా చేసిన…
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు శాంతియుతంగా జరిగిన నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. ఓ వైపు గోటబయ సర్కార్ ఎమర్జెన్సీ విధించినా… ఆందోళనలు తగ్గడం లేదు. దాదాపుగా గత రెండు నెలల నుంచి శ్రీలంకలో ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో పాటు గ్యాస్, పెట్రోల్ కొరతతో శ్రీలంక అల్లాడుతోంది. ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామా తరువాత శ్రీలంకలో హింసాత్మక…
ద్వీపదేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. గ్యాస్, పెట్రోల్ దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితులు మధ్య ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి తమ ఆందోళన, నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏకంగా అధ్యక్షుడు రాజపక్సే నివాసానికి దగ్గర్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సేతో పాటు ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామాలను డిమాండ్ చేస్తున్నారు శ్రీలంక ప్రజలు. తాజాగా ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ప్రధాని…