పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిత్యావసరాల ధరలు తారాస్థాయికి చేరాయి.. పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. లంక ప్రభుత్వం అధీనంలో గల సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక్క రోజే లీటరు పెట్రోల్‌పై 84 రూపాయల భారం మోపింది. ప్రస్తుతం లంకలో లీటరు పెట్రోల్ ధర 338 రూపాయలుగా ఉంది. సూపర్ డీజిల్ ధర ఒక్క రోజే 75 రూపాయలు పెరిగి… 329 రూపాయలయ్యింది. ఇక ఆటోలకు ఉపయోగించే డీజిల్ ధర 113 రూపాయలు పెరిగి 289 రూపాయలకు…
శ్రీలంకలో సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే ఎమర్జెన్సీ ప్రకటించారు. శుక్రవారం రాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సరకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మరోవైపు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. రోజుకు 13 గంటలపాటు…
మయమ్మార్ దేశంలో తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం నెలకొన్నది. ఆరు నెలల క్రితం సైన్యం ఆధికారాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సమస్య ప్రారంభం అయింది. ప్రజలు సైన్యంపై తిరుగుబాటు చేయడంతో సైనిక ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ పై నిషేదం విధించింది. ఇంటర్నెట్‌ను డౌన్ చేసింది. డిజిటల్ పేమెంట్స్ లేకపోవడంతో డబ్బు కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంల వద్ద తెల్లవారుజాము 3 గంటల నుంచే క్యూలు కడుతున్నారు. ఏటీఎం లలో నిత్యం నగదును నింపుతున్నప్పటికీ సరిపోవడంలేదు. పైగా…