Anantnag-Rajouri: చరిత్ర సృష్టించిన అనంత్‌నాగ్-రాజౌరీ పోలింగ్.. 35 ఏళ్లలో ఇదే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ పోలింగ్ చరిత్ర సృష్టించింది. గత 35 ఏళ్లలో లేనంతగా ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో 51.35 శాతం ఓటింగ్ నమోదు చేసిందని స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎక్స్ ట్విట్టర్‌లో తెలిపింది. దీనితో కాశ్మీర్ లోయలోని మూడు పోలింగ్ కేంద్రాలు అత్యధిక ఓటింగ్‌ను నమోదు చేశాయని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Mallikarjun Kharge: గతంలో ఆమె తిరస్కరించారు..ప్రధాని అభ్యర్థిపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు
Also Read
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
అనంత్‌నాగ్-రాజౌరీ స్థానం నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. తన పార్టీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను నిర్బంధించారని ఆరోపిస్తూ ఆమె ఆందోళన కూడా చేశారు. పూంచ్ జిల్లాలో ఇరుపార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Skoda: త్వరలో కొత్త మోడళ్లతో భారత్ మార్కెట్లోకి స్కోడా..
ఇక ఆరో విడతలో భాగంగా శనివారం సాయంత్రం ఐదు గంటలకు దాదాపు 57.70 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 77.99 శాతం, అత్యల్పంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 52.02 శాతం ఓటింగ్ నమోదైంది. దేశ రాజధాని దిల్లీలో 53.75 పోలింగ్ నమోదైంది. హర్యానాలోని కర్నాల్ అసెంబ్లీకి ఉప ఎన్నిక, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసింది. ఇక ఏడో విడత జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.

తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?