దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసింది. చివరి విడత జూన్ 1న జరగనుంది. ఇక ఓటర్ డేటా 48 గంటల్లో విడుదల చేయాలంటూ పలువురు రాజకీయ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టి వాయిదా వేసింది. మొత్తానికి కొద్ది గంటల్లోనే ఎన్నికల సంఘం ఐదు విడతల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని విడుదల చేసింది. ఓటింగ్ డేటా అభ్యర్థులకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ఓటింగ్ డేటాను ఓటర్ టర్నవుట్ యాప్‌లో ఉంచామని తెలిపింది.
ఇది కూడా చదవండి: Item Songs: సీజన్ మొదలైంది.. ఐటెం గర్ల్స్ మాత్రం దొరకడం లే!
ఐదు విడతల్లో బూత్‌ల వారిగా పోలింగ్ డేటాను వెబ్‌సైట్‌లో ఉంచాల్సిందిగా ఈసీని ఆదేశించాలని ఏడీఆర్ వేసిన పిటిషన్‌పై శుక్రవారమే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే తాము ఈ విషయంలో ప్రస్తుత ఎన్నికల వేళ ఎలాంటి ఆదేశాలివ్వలేమని సుప్రీం తెలిపింది. ఈ విచారణ జరిగిన మరుసటి రోజు ఐదు విడతల్లో పోలైన కచ్చితమైన ఓటర్ టర్నవుట్ డేటాను ఈసీ వెల్లడించడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Gannavaram Airport: ప్రయాణికుల లగేజీ ఎయిర్ పోర్టులోనే వదిలెళ్లిన విమానం
తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభమైంది. ఇక ఓటరు టర్నింగ్ డేటా విడుదలలో జాప్యంపై వచ్చిన ఆరోపణలను ఈసీ ఖండించింది. ప్రతి దశలో పోలింగ్ రోజున ఉదయం 9:30 గంటల నుంచి ఓటర్ టర్నింగ్ యాప్‌లో డేటా ఎల్లప్పూడు అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఐదు విడతల పోలింగ్ శాతాలివే..
తొలివిడత-66.14
రెండో విడత-66.71
మూడో విడత-65.68
నాలుగో విడత-69.16
ఐదో విడత-62.20
ఇక శనివారం ఆరో విడత పోలింగ్ ముగిసింది. చివరి విడత జూన్ 1న జరగనుంది.