ఎన్నికల సంఘం తీరుపై మరోసారి కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానం కలుగుతుందన్నారు. అంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశామని.. హర్యానా, మధ్యప్రదేశ్లోనూ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే అనుకూలంగా వస్తున్నాయని చెప్పారు. బీహార్లో లక్షల మంది ఓట్లను తొలగించారన్నారు. బీహార్లో ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా ఓటర్ల జాబితా దేశ సంపద అని.. దానిని ఎందుకు చూపించట్లేదు? అని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడడానికి కారణమిదేనా?
మహారాష్ట్రలో ఐదు నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని.. ఐదేళ్లలో నమోదైన వారి కంటే.. ఐదు నెలల్లో నమోదైన ఓటర్లే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య సమయంలో కోటి మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. ఆ సమయంలో ఓటర్ల జాబితా ఇచ్చేందుకు ఈసీ నిరాకరించిందని గుర్తుచేశారు. దేశ సంపదను చూపించేందుకు ఎన్నికల సంఘానికి వచ్చిన ఇబ్బందేంటి? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Google AI Pro: ఫ్రీ.. ఫ్రీ.. విద్యార్థులకు శుభవార్త.. ఏడాదిపాటు గూగుల్ AI ప్రో ప్లాన్ ఉచితం.. కాకపోతే!
బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. అటు పార్లమెంట్‌లోనూ.. ఇటు అసెంబ్లీలోనూ నేతలు ఆందోళనలు నిర్వహిస్తు్న్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఈసీ పని చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 65 లక్షల ఓట్లు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టగా… వాయిదాల పర్వం కొనసాగుతోంది.
బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఇందుకోసం ఈసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి తుది ఓటర్ల జాబితాను ప్రకటించనుంది. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇక అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇది కూడా చదవండి: Shwetha Menon : అశ్లీల చిత్రాలతో.. డబ్బు సంపాదిస్తోన్న మలయాళ నటి పై పోలీస్ కేసు!