Rahul Gandhi: ‘‘ఓట్ చోరీ’’పై ఈసీ ఇప్పటిదాకా స్పందించలేదు.. మరిన్ని ఆధారాలు ఉన్నాయన్న రాహుల్‌గాంధీ
- ‘‘ఓట్ చోరీ’’పై ఈసీ ఇప్పటిదాకా స్పందించలేదు
- మరిన్ని ఆధారాలు ఉన్నాయన్న రాహుల్‌గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓట్ల దొంగతనంపై మరోసారి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హోల్‌సేల్‌గా ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు. ఓట్ల చోరీపై తన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఓట్ల చోరీపై ప్రజెంటేషన్లు కొనసాగుతాయని చెప్పారు. ప్రధాని మోడీ ‘‘చునావ్ చోరీ’’ ద్వారా ప్రధాని అయ్యారని తెలిపారు. బీజేపీ ఓట్ల చోరీపై యువతకు స్పష్టంగా తెలియజేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court: వీధి కుక్కల బెడదపై మరోసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
హర్యానాలో జరిగిన ఎన్నికలు.. అస్సలు ఎన్నికలే కాదన్నారు. తాను చేసిన ఆరోపణలకు ఇప్పటి వరకు ఎన్నికల సంఘం స్పందించలేదని తెలిపారు. నకిలీ ఓటు, నకిలీ ఫొటోలతో బీజేపీ నాయకులు ఓట్లు వేశారని.. దీనిని బీజేపీ కూడా సమర్థిస్తోందని విమర్శించారు. తన ప్రజెంటేషన్‌లో చూపిస్తున్న చిన్న ఉదాహరణలనే మీడియా తీసుకుంటోందని.. బ్రెజిలియన్ మహిళ ఓటు వేసింది ఎవరని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా, ఈసీ కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ఒక మనిషి.. ఒక ఓటు అని చెబుతోంది.. కానీ హర్యానాలో మాత్రం ఒక మనిషి.. బహుళ ఓట్లు అని బీజేపీ అంటోందని పేర్కొన్నారు. ఇప్పుడు బీహార్‌లో కూడా అదే ఒరవడిని బీజేపీ చేయబోతుందన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, గుజరాత్‌లో జరిగింది కూడా ఇదేనన్నారు.
ఇది కూడా చదవండి: Russia: విషాదం.. రష్యాలో అదృశ్యమైన భారతీయ మెడికల్ విద్యార్థి మృతదేహం లభ్యం
బీహార్‌లో తొలి విడత పోలింగ్‌కు ముందు బుధవారం ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హర్యానాలో జరిగిన ఓట్ల చోరీపై అనేక ఆధారాలు చూపించారు. బీజేపీ నేత కుమారుడు రెండు చోట్ల ఓటు వేశారని ఆరోపించారు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలపై ఇప్పటి వరకు ఈసీ స్పందించలేదు.
#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi says, "…We have a lot of material, we will continue this process. We will clearly show India's GenZ and youth that Narendra Modi became the PM through 'chunav chori' and BJP indulges in 'chunav chori'…"
On a BJP leader reportedly… pic.twitter.com/Is3GCRClg9
— ANI (@ANI) November 7, 2025
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!