త్వరలో జరగనున్న ఐపీఎల్-2022 వేలం బరిలో తూర్పు గోదావరి జిల్లా రాజోలు కుర్రాడు 29 ఏళ్ల బండారు అయ్యప్ప అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మీడియం పేస్ బౌలర్‌గా, రైట్ హ్యాండ్ బ్యాటర్‌గా అయ్యప్ప రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2019 లీగ్‌లో అయ్యప్పను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే తుది జట్టులోకి మాత్రం తీసుకోలేదు.
Read Also: ఇండియాలో ఐపీఎల్ నిర్వహించడంపై గంగూలీ క్లారిటీ
అయితే ఈసారి భారీ ధరకు ఫ్రాంచైజీలు తనను కొనుగోలు చేయాలని అయ్యప్ప కృతనిశ్చయంతో ఉన్నాడు. 2011 నుంచి ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యప్ప.. 2015–16 రంజీ సీజన్‌లో ముంబై జట్టుపై ఆరు వికెట్లు తీసి తొలిసారి వార్తల్లో నిలిచాడు. దీంతో అతడికి 2018–19లో ఇండియా బ్లూ జట్టులో స్థానం దక్కింది. కెరీర్‌లో ఇప్పటివరకు 32 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 31 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 37 టీ20లు ఆడిన అయ్యప్ప.. మొత్తం 167 వికెట్లు పడగొట్టాడు.