టీజీ ఎప్‌సెట్ కోసం ఎదురుచూసే విద్యార్థులకు గుడ్ న్యూస్.ఫిబ్రవరి 20వ తేదీన టీజీ ఎప్‌సెట్-2025 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ – హైదరాబాద్ ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఎస్‌సెట్‌ను జేఎన్టీయూ నిర్వహిస్తోంది. గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసి, 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ను ఇతర వివరాలను రేపు https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో పొందుపర్చనున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ రోజు కేటాయించనున్న తెలంగాణ ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు అర్థరాత్రి కానీ.. రేపు కానీ ఆలాట్మెంట్ ప్రకటించనున్నారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి సమయం పొడిగించడంతో కేటాయింపు ఆలస్యం కానుంది. కాగా.. కన్వీనర్ కోటాలో 72 వేల 741 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే.. దాదాపు 96 వేల మందికి పైగా విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు.
TS EAPCET 2024: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగనున్న పలు ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. EAPCET పరీక్షను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
ఎంసెట్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు సర్కార్ వెల్లడించింది.
ఎంసెట్‌లో మిగిలిన అగ్రికల్చర్, మెడికల్ (ఏఎం) ప్రవేశ పరీక్షలు శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. రెండు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు. శని, ఆదివారాల్లో మొదటి సెషన్ ఉదయం 9 ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల ముగుస్తుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 94 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం తెలంగాణలో 89, ఆంధ్రప్రదేశ్‌లో 19 సహా 108 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు.…
తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వానలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో జరగాల్సిన ఎంసెట్, ఈసెట్ పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 న ఈసెట్… ఈ నెల 14 నుంచి ఎంసెట్ ఎగ్జామ్స్ జరగాలి. అయితే తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్న క్రమంలో వీటిని…
ఎల్లుండి నుండి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 4,5,6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ మొత్తం 6 సెషన్స్ లో…. 9,10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ 3 సెషన్స్ లో జరగనున్నాయి. ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది ఎంసెట్ కి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2 లక్షల 51 వేల 606 గా ఉంది. ఇందులో…
కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు కాగా.. మరికొన్ని పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. లాక్‌డౌన్ నేపథ్యంలోనూ మరికొన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి.. ఇక, ఆగస్ట్‌లో జరగనున్న ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది ప్రభుత్వం.. ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఎలాంటి అపరాద రుసుం లేకుండా ఈ నెల 8వ తేదీ వరకు స్వీకరించనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు.. లాక్‌డౌన్ కారణంగా.. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని…
తెలంగాణ ఎంసెట్ పరీక్షకు ఇప్పటి వరకు దరఖాస్తు చేయని విధ్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కెసిఆర్ సర్కార్. తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు ఈ నెల 26 వరకు పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. ఇక ఇప్పటికే లక్ష 50 వేలు దాటాయి తెలంగాణ ఎంసెట్ దరఖాస్తులు. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో లక్షా 6 వేల 506 దరఖాస్తులు రాగా..…