ఎంసెట్‌లో మిగిలిన అగ్రికల్చర్, మెడికల్ (ఏఎం) ప్రవేశ పరీక్షలు శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. రెండు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు. శని, ఆదివారాల్లో మొదటి సెషన్ ఉదయం 9 ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల ముగుస్తుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 94 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం తెలంగాణలో 89, ఆంధ్రప్రదేశ్‌లో 19 సహా 108 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించారు. కాగా, ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ నేడు విడుదల కానుంది.
read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
EAMCET కన్వీనర్ డాక్టర్ A.గోవర్ధన్ మాట్లాడుతూ.. “పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యార్థులు పరీక్షకు రెండు గంటల ముందు కేంద్రాలకు రిపోర్టు చేయాలని అభ్యర్థించారు. వారు తమ హాల్ టిక్కెట్లు మరియు ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్‌ని తీసుకెళ్లాలి. ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలు ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉండగా, భారీ వర్షాల కారణంగా వాటిని రద్దు చేసిన విషయం తెలిసిందే.
Happy Birthday Sonu Sood : ‘రియల్ హీరో’… సోనూ సూద్!