ఎల్లుండి నుండి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 4,5,6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ మొత్తం 6 సెషన్స్ లో…. 9,10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ 3 సెషన్స్ లో జరగనున్నాయి. ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది ఎంసెట్ కి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2 లక్షల 51 వేల 606 గా ఉంది. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ లక్ష 64 వేల 962 మంది.. అగ్రి, మెడికల్ స్ట్రీమ్ 86 వేల 644 గా ఉంది. మొత్తం 105 పరీక్ష కేంద్రాలలు ఉండగా అందులో తెలంగాణ లో 82, ఆంధ్రలో 23 ఉన్నాయి.