తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ రోజు కేటాయించనున్న తెలంగాణ ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు అర్థరాత్రి కానీ.. రేపు కానీ ఆలాట్మెంట్ ప్రకటించనున్నారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి సమయం పొడిగించడంతో కేటాయింపు ఆలస్యం కానుంది. కాగా.. కన్వీనర్ కోటాలో 72 వేల 741 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే.. దాదాపు 96 వేల మందికి పైగా విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు.
Read Also: Himanta Biswa Sarma: 2041 నాటికి ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా అస్సాం.. సీఎం ఆందోళన..
తెలంగాణ ఈఏపీసెట్ 2024 తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 4 నుంచి ప్రారంభమైంది. జులై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి.. ధ్రువపత్రాల పరిశీలనకు ఎప్పుడు హాజరవుతారో స్లాట్ బుక్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6 నుంచి 13 వరకు 36 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏదో ఒకచోట సర్టిఫికెట్స్ పరిశీలనకు హాజరయ్యారు. పరిశీలన చేయించుకున్న వారు ఈ నెల 8 నుంచి 15 వరకు వారికి తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఈ నెల 19వ తేదీ తొలి విడత సీట్లు కేటాయించనున్నారు. కాగా.. షెడ్యూల్ ప్రకారం.. రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 26 నుంచి ప్రారంభంకానుంది. అలాగే.. చివరి దశ కౌన్సెలింగ్ ఆగస్టు 8 నుంచి ప్రారంభమవుతుంది.
Read Also: Jharkhand: రోడ్డెక్కిన అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది.. జీతాలు పెంచాలని నిరసన