Cuts Off Private Part: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లా ఓ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహిత ఒకరు గొడవల నేపథ్యంలో తన భర్తపై విచక్షణ లేకుండా దాడి చేసి అతడి ప్రైవేట్ పార్ట్ కోసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ తర్వాత ఆమె తానే యాసిడ్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడం ఆ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అస్మోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. భర్త భార్యల…
UP techie Suicide: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య, అత్తమామల వేధింపులతో తాను ఎంతటి బాధను అనుభవించాననే విషయాన్ని వీడియోలో వెళ్లడించి, సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు వ్యక్తులు, భార్యల వేధింపుల వల్ల మరణించారు. చట్టాలను దుర్వినియోగం చేసి, అక్రమ కేసులు పెట్టడం, మానసికంగా వేధించడంతో పలువురు తనువు చాలిస్తున్నారు.
అత్త తన కోడలిపై గృహ హింస కేసు పెట్టవచ్చా? అలహాబాద్ హైకోర్టులో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. అలహాబాద్ హైకోర్టులో ఓ అత్త తన కోడలు గృహ హింసకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేసింది. తాజాగా కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. విచారణ సమయంలో.. అత్తగారు తన కోడలిపై ఇలాంటి కేసు పెట్టవచ్చా? అనే ప్రశ్న తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గరిమా తన కోడలితో పాటు 5 గురు కుటుంబీకులపై ఈ ఫిర్యాదు చేసింది.
మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ స్వీటీ బోరా, ఆమె భర్త దీపక్ హుడా మధ్య వివాదం మరింత పెరుగుతోంది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుకున్న తర్వాత ఈ వివాదం ఎక్కువైంది. భర్త దీపక్ హుడాపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీపక్ హుడాకు అబ్బాయిలంటే ఆసక్తి ఉందని స్వీటీ చెప్పింది. ఈ విషయం తనకు తరువాత తెలిసిందని చెప్పింది.
భారత కబడ్డీ టీమ్ మాజీ ప్లేయర్ దీపక్ నివాస్ హుడా, అతని భార్య భారత దిగ్గజ బాక్సర్ స్వీటీ బూరా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీపక్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ స్వీటీబూరా పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతుండగా అసహనానికి గురైన స్వీటీబూరా దీపక్ గళ్లా పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆ నేరాన్ని రోడ్డు ప్రమాదంగా చూపించడానికి ఆమె మృతదేహాన్ని వీధిలో వదిలివెళ్లాడు.
వరకట్న వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాలం వంద స్పీడ్ తో ముందుకు సాగుతున్న ఈ పద్ధతి మాత్రం మారడం లేదు. అత్త వేధింపులు, భర్త అరాచకాలు తగ్గడం లేదు. ఇందులో భాగంగా తాజాగా ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆగస్టు నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు శరత్ ,దేవిక. ఎంబీఏ పూర్తి చేసిన దేవిక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, ఐఐటీ ఖరగ్పూర్‌లో చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు శరత్. ఇద్దరి…
విజయవాడలో కట్నం కోసం నవ వధువుకు వేధింపుల పర్వం బయటపడింది. రూ.5 కోట్లు ఇచ్చినా.. పెళ్లైన రెండు రోజులకే కట్నం వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేని వధువు భవానీపురం పోలీసులకు కంప్లైంట్ చేసింది. భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 498A, వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3,4 ల కింది కేసు నమోదు చేసి పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. తండ్రీ కొడుకులకు 14 రోజుల రిమాండ్ విధించి.. నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించారు. చెరుకూరి లక్ష్మణరావు విజయవాడ…
ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముక్కు ముఖం తెలియని వారు ప్రేమించుకోవడం.. ఆ తర్వాత చిన్న కారణాలతో మనస్పర్థలు వచ్చి హత్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ దారుణాలకు సోషల్ మీడియా కారణం కావడం అత్యంత బాధాకరం. తాజాగా సోషల్ మీడియా ప్రేమ ఓ ఫోక్ సింగర్ ప్రాణం తీసింది.