అత్తింటి వేధింపులు తాళలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆఫీసుకు వెళ్లి కనిపించకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని.. దుర్గం చెరువులో శవమై తేలింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతికి అత్తింటి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 3 నెలల క్రితమే వివాహం జరిగిన ఆమె కాపురంలో కట్నం మహమ్మారి చిచ్చు పెట్టింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న సుష్మ. ఈ ఫోటోలో మీరు చూస్తున్న యువతి పేరు సుష్మ.. మాదాపూర్‌లోని డైబోల్డ్ మిక్స్‌డార్క్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది..
మూడు నెలల క్రితం సుష్మకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అమృత్‌తో పెళ్లి జరిగింది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది సుష్మ. కొన్ని రోజుల పాటు సుష్మ కాపురం.. మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. కానీ.. 3 నెలలకే ఆమె పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. ఆమె కాపురంలో అదనపు కట్నం మహమ్మారి చిచ్చు పెట్టింది… అదనపు కట్నం కోసం భర్త వేధింపులు నెమ్మదిగా షురూ అయ్యాయి. ఆ తర్వాత అతని పేరెంట్స్ కూడా కట్నం వేధింపులు మొదలుపెట్టారు.
8 Vasantalu Review: 8 వసంతాలు రివ్యూ
రెండు రోజుల క్రితం ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పుట్టింటికి వచ్చింది సుష్మ. తల్లిదండ్రులు ఆమెకు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆ తరువాత రోజూ మాదిరిగానే మాదాపూర్‌లోని తన ఆఫీస్‌కి వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి బయల్దేరింది. సాయంత్రం ఐనా సుష్మ మాత్రం తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అత్తింటి వారిని ఆరా తీశారు సుష్మ పేరెంట్స్. అక్కడికి కూడా రాలేదని చెప్పడంతో.. రాత్రంతా సుష్మ కోసం ఆమెకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువులను అడిగారు. కాని ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సుష్మ తండ్రి…
సుష్మ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు కాసేపటికే దుర్గం చెరువులో ఓ యువతి డెడ్‌బాడీ తేలుతుందని సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు, యువతి డెడ్‌బాడీ దుర్గం చెరువు నుంచి బయటికి తీశారు. అక్కడికి వచ్చిన సుష్మ తండ్రి ఆమె డ్రెస్ ఆధారంగా ముందుగా తన కూతురేనని పోలీసులకు చెప్పాడు. డెడ్‌బాడీని బయటికి తీయడంతో తన కూతురు సుష్మ డెడ్‌బాడీ అని పోలీసులకు స్పష్టం చేశాడు. దీంతో పోలీసులు సుష్మ సూసైడ్ చేసుకున్నట్లుగా నిర్థారించారు. ఐతే సుష్మ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెను అత్త, మామ, భర్త అమృత్ వేధించి చంపారని అంటోంది సుష్మ తల్లి.
పెళ్లికి ఘనంగా కట్నకానుకలు, బైక్ ఇచ్చి మరి పెళ్లి చేశామని.. కానీ గత కొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని అంటోంది… అత్త,మామ, భర్త వేధింపులు, అవమానాలు తాళలేకే సుష్మ ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడని పోలీసులు చెబుతున్నారు. సుష్మ అత్తామామ, భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తామని చెబుతున్నారు మాదాపూర్ పోలీసులు.. అత్తింటి అదనపు కట్నం వేధింపులకు మరో అబల బలైంది. పెళ్లైన 3 నెలల్లోనే ఆమె నిండు నూరేళ్ల జీవితం ముగిసిపోయింది. కట్నం కాటుకు సుష్మ లాంటి మహిళలు బలి కాకుండా చూడాలని ఆమె తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు…
Axiom-4: ఆక్సియం -4 మిషన్ ప్రయోగాన్ని మళ్ళీ వాయిదా వేసిన నాసా..