Dowry Harassment: అత్తింటి వారి వరకట్న దాహానికి మరో అమ్మాయి బలైంది. ఈ వారం ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ బాగ్‌పత్‌లో అత్తమామాల నుంచి కట్నం వేధింపులు తట్టుకోలేక 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తాను అనుభవించిన బాధల్ని తన శరీరంపై సూసైడ్ నోట్‌గా రాసుకుంది. మంగళవారం రాత్రి మనీషా అనే మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త కుందన్, అతడి కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించింది.
పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు...!! భర్త వేధిస్తున్నాడని భార్య హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది ! లక్కీగా స్థానికులు కాపాడారు. ప్రాణాలతో బయటపడింది. హమ్మయ్య అనుకునేలోపు.. భార్య కేసు పెట్టిందని భర్త హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హ్యాపీగా సంసారం చేసుకోవాల్సిన జంట.. సాగర్ లో ఎందుకు దూకింది. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిందెవరు..?
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఒక మహిళ పెళ్లి రోజు రాత్రి తన భర్తను చూసి ఆశ్చర్యపోయింది. తన భర్త నపుంసకుడు అని ఆరోపిస్తోంది. తన అత్తమామలు కట్నం కోసం నపుంసకుడితో తనకు వివాహం చేశారని ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని తన అత్తామామలకు చెబితే కొట్టి చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Dowry Harassment: అదనపు కట్నం.. మరో మహిళను చిదిమేసింది. తమిళనాడులోని తిరుప్పూరులో పెళ్లైన 2 నెలలకే వధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భర్త, అత్తమామలు పెట్టిన వేధింపులు తట్టుకోలేక బలవన్మరణం చెందింది. వరకట్న నిషేధ చట్టం వచ్చి 60 ఏళ్లు పూర్తయినా.. అరాచకాలు మాత్రం ఆగటం లేదు. అదీ చదువుకున్న వాళ్లు.. బాగా ఆస్తి, ఐశ్యర్యంతో సెటిల్ అయినవాళ్లు కట్నం కోసం వేధించి చంపేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. తమిళనాడులో తాజాగా అలాంటి ఘటనే జరిగింది.…
పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉన్న ఆ ఎస్సై దారి తప్పాడు. తన వద్దకు వచ్చే వారికి మంచి చెడు చెప్పాల్సిన వృత్తిలో ఉండి తన వంకర బుద్ధి బయట పెట్టుకున్నాడు. కట్టుకున్న భార్యపైనే నిత్యం వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వేధింపులు తాళలేక ఆమె ఉసురు తీసుకుంది. ఖమ్మంలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఫొటోలో ఉన్న ఇతని పేరు రాణా ప్రతాప్. ఖమ్మంలోని రైల్వే విభాగంలో ఎస్సైగా పని చేస్తున్నాడు. ఇతనికి 8 ఏళ్ల క్రితం…
వరకట్న పిశాచికి మరో అబల బలైపోయింది. కూతురు జీవితం సుఖంగా ఉండాలని భారీగా కట్న, కానుకలు ఇచ్చి ఎంతో గ్రాండ్‌గా వివాహం జరిపించాడు ఆ తండ్రి. అయినా కూడా అత్తింటి వారికి ధనదాహం తీరలేదు.
వరకట్నం కోసం భార్యను హత్య చేశాడు ఓ భర్త.. కేసు సుప్రీంకోర్టుకు చేరుకుంది. కోర్టులో ఆ భర్త విచిత్ర కోరిక కోరాడు. ఎంతటి వ్యక్తులకైనా చట్టం ఒక్కటే అని తెలియదేమే విచిత్ర కోరిక కోరాడు. తాను ‘ఆపరేషన్ సిందూర్’లో పని చేశానని.. ఈ కేసులో మినహాయింపు కల్పించాలని ఆ కమాండో సుప్రీంకోర్టును కోరాడు.
Tragedy : ఇది ప్రేమ పెళ్లి కాదు. కానీ, ఒక కొత్త జీవితంపై కలలు కంటూ అడుగుపెట్టిన నవ వధువు.. ఆ జీవితం బంధనంగా మారుతుందని ఊహించలేకపోయింది. భర్త వేధింపులతో ఆమె ఉక్కిరిబిక్కిరై, చివరకు ప్రాణాలు తీసుకునే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే యువకుడు KPHB లో ఓ ప్రైవేట్ షాపులో సెల్స్ మాన్‌గా పని చేస్తుంటాడు. అతడు, పూజిత అనే యువతిని…
అత్తింటి వేధింపులు తాళలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆఫీసుకు వెళ్లి కనిపించకుండా పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. దుర్గం చెరువులో శవమై తేలింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతికి అత్తింటి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 3 నెలల క్రితమే వివాహం జరిగిన ఆమె కాపురంలో కట్నం మహమ్మారి చిచ్చు పెట్టింది. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న సుష్మ. ఈ ఫోటోలో మీరు చూస్తున్న యువతి పేరు సుష్మ.. మాదాపూర్లోని డైబోల్డ్…
Suicide : హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. బాధితురాలిని సుష్మ (27)గా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుఝామున 4 గంటలకు బొట్టు అంజయ్య అనే వ్యక్తి మిస్సింగ్ కంప్లైంట్ను మాదాపూర్ పోలీసులకు ఇచ్చారు. “ఆఫీస్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సుష్మ తిరిగి రాకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.…