వరకట్న వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాలం వంద స్పీడ్ తో ముందుకు సాగుతున్న ఈ పద్ధతి మాత్రం మారడం లేదు. అత్త వేధింపులు, భర్త అరాచకాలు తగ్గడం లేదు. ఇందులో భాగంగా తాజాగా ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆగస్టు నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు శరత్ ,దేవిక. ఎంబీఏ పూర్తి చేసిన దేవిక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, ఐఐటీ ఖరగ్పూర్‌లో చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు శరత్. ఇద్దరి జీవితాలు మొదట ఎంతో సాఫిగా సాగగా రాను రాను శరత్ మార్పు మొదలైంది.
అలా గత కొన్ని రోజుల నుంచి శరత్ దేవికల మధ్య పరస్పర గొడవలు జరిగాయి. దీంతో మనస్థాపానికి గురి అయిన దేవిక నిన్న ఉదయం ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే దేవిక మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కట్నం కోసం శరత్ తమ కూతురు దేవికను వేధించేవాడని ఆరోపిస్తుంది దేవికా తల్లి. 5 లక్షల కట్నం 15 తులాల బంగారం ఇచ్చిన కూడా అదనపు కట్నం కోసం వేధించడంతో మానసికంగా కృంగిపోయి దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.