Suicide : హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. బాధితురాలిని సుష్మ (27)గా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుఝామున 4 గంటలకు బొట్టు అంజయ్య అనే వ్యక్తి మిస్సింగ్ కంప్లైంట్‌ను మాదాపూర్ పోలీసులకు ఇచ్చారు. “ఆఫీస్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సుష్మ తిరిగి రాకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఉదయం 7 గంటలకు దుర్గం చెరువు వద్ద ఒక మృతదేహం కనిపించిందని సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. అది మిస్సింగ్ అయిన సుష్మదిగా గుర్తించారు.
Shocking Incident: బెంగళూరు అపార్ట్‌మెంట్‌లో భారీగా అస్థి పంజరాలు లభ్యం!
సుష్మ ఈ ఏడాది జనవరి 31న అమృత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుంది. అమృత్ కూడా ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. సుష్మ తల్లిదండ్రుల ప్రకారం.. పెళ్లి సమయంలో 6 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు, బైక్‌ను కట్నంగా ఇచ్చారు. అయినప్పటికీ సుష్మ అత్త, మామలు అదనపు కట్నం కోసం వేధించారని, ఇటీవల ఆమె శారీరకంగా, మానసికంగా తీవ్రంగా బాధపడుతోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కొద్దీ రోజులుగా ఆరోగ్యం బాగాలేదని, నేరెడ్‌మేట్‌లోని ఓ హాస్పిటల్‌లో సుష్మను రెండు రోజుల క్రితం వైద్యులకు చూపించినట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. అయితే.. నిన్న ఆమె తిరిగి ఆఫీస్‌కు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ తిరిగి రాలేదని వారు తెలిపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, సుష్మ తన అత్తింటి వారు, భర్త నుంచి ఎదుర్కొంటున్న అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానిస్తున్నారు. మాదాపూర్ సీఐ కృష్ణ మోహన్ మీడియాతో మాట్లాడుతూ, “కేసు నమోదు చేశాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. విచారణ కొనసాగుతోంది” అని తెలిపారు.
YS Jagan: 9వ తరగతి బాలికకు న్యాయం చేసే దమ్ము చంద్రబాబుకు లేదా?