Harassment: తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో 32 ఏళ్ల మహిళ, మామ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. అత్తమామల నుంచి గత కొన్ని ఏళ్లుగా వరకట్న వేధింపులకు కారణంగా తనవు చాలించేందుకు ఒంటికి నిప్పంటించుకుంది. బాధితురాలిని రంజితగా గుర్తించారు. 70 శాతం కాలిన గాయాలతో రంజిత, మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
Read Also: CM Revanth Reddy: “కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ చేశారు..” ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు..
రంజిత తన మరణ వాంగ్మూలంలో మామపై సంచలన ఆరోపణలు చేసింది. ‘‘ మా మామగారు నన్ను కౌగిలించుకున్నారు. నేను దానిని తట్టుకోలేకపోయాను. అందుకు ఆత్మాహుతి చేసుకున్నాను’’ అని చెప్పింది. మామ అనుచిత ప్రవర్తనే కాకుండా, భర్త, అత్తమామాల నుంచి వరకట్న వేధింపులు కూడా రంజిత మరణానికి కారణమని ఆమె కుటుంబం ఆరోపించింది.
రంజిత సోదరి అలగసుందరి మాట్లాడుతూ.. తన సోదరిని 13 ఏళ్లుగా హింసిస్తున్నారని, ఒక ఫ్లాట్, మరింత బంగారం డిమాండ్ చేస్తున్నారరని, ఆమె మామ లైంగికంగా వేధించాడని, ఆమె భర్త తాగొచ్చి కొట్టే వాడని, ఆమె ప్రతీదాన్ని మౌనంగా భరించిందని, ఆమెను చూడటానికి వెళ్తే మమ్మల్ని అనుమతించే వారు కాదని, చూడాలనుకుంటే పుట్టింటికి పంపిస్తామని బెదిరించే వారని చెప్పింది. ఈ ఘటన స్థానికంగా ఆగ్రహానికి కారణమైంది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.