Dowry Harassment: అదనపు కట్నం.. మరో మహిళను చిదిమేసింది. తమిళనాడులోని తిరుప్పూరులో పెళ్లైన 2 నెలలకే వధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భర్త, అత్తమామలు పెట్టిన వేధింపులు తట్టుకోలేక బలవన్మరణం చెందింది. వరకట్న నిషేధ చట్టం వచ్చి 60 ఏళ్లు పూర్తయినా.. అరాచకాలు మాత్రం ఆగటం లేదు. అదీ చదువుకున్న వాళ్లు.. బాగా ఆస్తి, ఐశ్యర్యంతో సెటిల్ అయినవాళ్లు కట్నం కోసం వేధించి చంపేస్తుండటం ఆందోళన కలిగించే అంశం.
తమిళనాడులో తాజాగా అలాంటి ఘటనే జరిగింది. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ.. అబ్బాయికి మంచి ఉద్యోగం. అయితేనేం.. తమ తాహతుకు తగినంత కట్నం ఇచ్చుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించి భారీగా కట్న కానుకలు ఇచ్చారు. అయినా మరింత కావాలని వేధింపులు చేయడంతో మానసికంగా కృంగి పోయిన నవవధువు సూసైడ్ చేసుకుని చనిపోయింది.
Read Also:Off The Record: సైలెంట్ మోడ్‌లోకి బాలినేని..! పవన్ చెప్పేశారా..?
తమిళనాడు తిరుప్పూర్‌లో 27 ఏళ్ల రాధన్య అనే నవవధువు మృతి చెందడం కలకలం రేపింది. బట్టల కంపెనీ ఓనర్ అయిన అన్నాదురై కూతురు రాధన్యను 2025, ఏప్రిల్‌లో కవిన్ కుమార్ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లిలో ఒప్పందాల ప్రకారం 800 గ్రాముల బంగారు నగలు, 70 లక్షల విలువ చేసే వోల్వో కార్ కానుకగా ఇచ్చారు. మొత్తంగా రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించి ఘనంగా వివాహం జరిపించారు. కానీ ఆ పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది.
Read Also:Crime News: ఇద్దరు పిల్లలతో సహా భార్యను కోర్టుకు తీసుకెళ్లిన భర్త.. చివరికి..?
ఆదివారం మొండిపాల్యంలోని గుడికి వెళ్తున్నానని చెప్పి రాధన్య బయటకు వెళ్లింది. మార్గమధ్యంలో కారు ఆపేసి పురుగు మందు ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకుంది. కార్ పార్క్ చేసి ఉండటాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. కారులో రాధన్య మందు మాత్రలు మింగి చనిపోయినట్లు గుర్తించారు. ఇక చనిపోయే ముందు ఆమె తన తండ్రికి ఏడు వాయిస్ మెసేజెస్ పెట్టినట్లు తెలుస్తోంది. భర్త, అత్తమామల టార్చర్ తట్టుకోలేక పోతున్నానని.. ఈ నిర్ణయం తీసుకుంటున్నందుకు క్షమించాలని తండ్రిని మెసేజ్ ద్వారా వేడుకుంది. భర్త సహా అత్తమామల టార్చర్ తట్టుకోలేక పోతున్నా. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. ఎవరికైనా చెప్పుకున్నా.. జీవితంలో ఇలాంటి కష్టాలు కామన్. భరించాలి అంటున్నారు కానీ.. నా సమస్యను ఎవరూ అర్థం చేసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది రాధన్య. ప్రస్తుతం ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్త కవిన్ కుమార్, అత్తా మామలు ఈశ్వరమూర్తి, చిత్రాదేవీపై కేసు నమోదు చేశారు పోలీసులు.