అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఘన విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించనున్నారు. నాలుగేళ్ల పాటు అగ్ర రాజ్యం రిపబ్లికన్ పార్టీ వశం కాబోతుంది. తాజా ఫలితాల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
US-Canada: కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ వలసలు పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అక్రమంగా సరిహద్దు దాటడం 10 రెట్లు పెరిగినట్లు చెబుతోంది. యూఎస్ సరిహద్దు గస్తీ డేటా ఈ వివరాలను చెబుతోంది. భారతదేశం నుంచి అక్రమ వలసలు ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో ఇది ఎక్కువగా పెరిగినట్లు అమెరికన్ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. యూఎస్ సరిహద్దు డేటా ప్రకారం.. సెప్టెంబర్ 30 వరకు ఈ ఏడాదిలో యూఎస్-కెనడా సరిహద్దుల్లో 14,000 మందికి పైగా…
హెచ్1బీ వీసా గురించి శోధిస్తున్న ప్రాంతాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా.. చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఆ తరువాత స్థానాల్లో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.
Donald Trump: ఖలిస్తాన్ ఉగ్రవాది, అమెరికన్ సిటిజన్ అయిన గురుపత్వంత్ సింగ్ నిజ్జర్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణతో భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారిపై కేసు నమోదు చేసిన ఫెడరల్ ప్రాసిక్యూటర్ డామియన్ విలియమ్స్‌ని కొత్తగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. ఇతడి స్థానంలో న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌కి డిస్ట్రిక్ట్ అటార్నీగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) మాజీ ఛైర్మన్ జే క్లేటన్‌ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ గురువారం ప్రకటించారు
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అస్థిరత వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో యావత్ ప్రపంచం భారతదేశ రాజకీయ సుస్థిరతపై ఓ కన్నేసి ఉంచుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం మాములు విషయం కాదని తెలిపారు.
US-Iran: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని చంపే ప్రయత్నం చేయబోమని ఇరాన్ గత నెలలో అమెరికాకు తెలియజేసినట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులు ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్‌తో పంచుకన్నారు. అక్టోబర్ 14న ఇరాన్ ఈ మేరకు అమెరికకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ట్రంప్‌కి వ్యతిరేకంగా ఏదైనా బెదిరింపులు యూఎస్ జాతీయ భద్రతకు సంబంధించిన అత్యున్నత ఆందోళన అని బైడెన్ ప్రభుత్వం ఇరాన్‌కి స్పష్టం చేసిందని, అలాంటి ఏ చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని యూఎస్…
Donald Trump: హిందువులతో పాటు మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని భారతీయ అమెరికన్లు కోరుతున్నారు. ఈ మేరకు బంగ్లాదేశ్‌పై ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు చర్యలు తీసుకోవాలని వచ్చే ఏడాది ఏర్పాటు కాబోతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ని, యూఎస్ కాంగ్రెస్‌ని సంప్రదించడానికి భారతీయ అమెరికన్లు కృషి చేస్తున్నారు.
Donald Trump On Russia-Ukraine Issue: అధికారం చేపట్టిన 24 గంటల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. జనవరి 2025లో ట్రంప్ అధికారం చేపట్టనున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే ఈ శాంతి ఒప్పందానికి సిద్ధమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. క్రెమ్లిన్ చర్చల కోసం దాని స్వంత నిబంధనలను సెట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. పుతిన్ తన సైన్యం నిరంతరం ముందుకు సాగుతున్నందున ఒప్పందం…
Doug Collins: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన జట్టును ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి మాజీ జార్జియా కాంగ్రెస్ సభ్యుడు డగ్ కాలిన్స్ ని తన మంత్రి వర్గంలో చేర్చుకున్నాడు. సమాచారం ప్రకారం, అతను తదుపరి అమెరికా వెటరన్స్ అఫైర్స్ (VA) కార్యదర్శి పదవికి నామినేట్ అయ్యారు. గురువారం ఒక ప్రకటనలో.. చురుకైన సైనిక సిబ్బంది, అనుభవజ్ఞులు, సైనిక కుటుంబాల కోసం వాదించే కాలిన్స్ సామర్థ్యంపై ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.…
Elon Musk: అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐక్యరాజ్య సమితికి టెహ్రాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానితో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమావేశం అయ్యారు.