Justin Trudeau: హాలీఫాక్స్ ఛాంబరాఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. తమపై ట్రంప్ అదనపు టారీఫ్ లు విధిస్తే.. తాము ప్రతి చర్యలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు.
America: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం భారత సంతతి, న్యాయవాది హర్మీత్ కె.ధిల్లాన్‌ను న్యాయ శాఖలో పౌర హక్కుల విభాగంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
Donald Trump: ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులు అందరినీ అమెరికా నుంచి తరిమేస్తానని వెల్లడించారు. అలాగే, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం మరింత సులువుగా చేస్తానని కాబోయే యూఎస్ అధ్యక్షుడు తెలిపారు.
సిరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు దళాలు బెదిరిస్తున్న వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదని డొనాల్డ్ ట్రంప్ శనివారం అన్నారు.
అమెరికన్ డాలర్‌కి పోటీగా కొత్త కరెన్సీని ఏర్పాటు చేయాలనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఖతార్ పర్యటనలో ఉన్న ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల రష్యా వేదిక జరిగిన బ్రిక్స్ సమావేశం తర్వాత ‘‘బ్రిక్స్ కరెన్సీ’’ ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చాయి. వర్థమాన ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్, రష్యా వంటి బ్రిక్స్ కూటమి దేశాలు ఈ కరెన్సీపై కసరత్తు చేస్తున్నాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు…
Bitcoin Price: క్రిప్టో కరెన్సీలో భాగమైన బిట్‌కాయిన్ అల్ టైం రికార్డు సృష్టించింది. దింతో బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లను దాటింది. ఇక అమెరికా ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత నూతన అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించనప్పటి నుండి దీని విలువ బాగా పెరుగుతోంది. మరోవైపు, ఎస్ఈసీ విభాగానికి క్రిప్టో అడ్వయిజర్‌ను అధిపతిగా ప్రత్యేకంగా నియమిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా బిట్‌కాయిన్ విలువ భారిగా పెరిగింది. మార్కెట్ లో బిట్ కాయిన్ విలువ మరింత పెరగవచ్చని…
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వయసు రీత్యా ఏం చేస్తున్నారో.. ఏ మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఆయన తీరు విమర్శల పాలైంది. తాజాగా ఆఫ్రికా పర్యటనలో కూడా జో బైడెన్ తీరు విమర్శల పాలైంది. సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమెరికా ఫస్ట్ అంటూ నినదించే ట్రంప్.. విదేశీయుల కారణంగా అమెరికన్లకు ఉపాధి దొరకడం లేదని మొదట్నుంచీ వాదిస్తున్నారు. దీంతో వలసలపై కఠినంగా వ్యవహరించాలని ముందే డిసైడయ్యారు. అధ్యక్షుడిగా మొదటి విడత పాలనలోనే వలసలపై చాలా కఠినంగా ఉన్న ట్రంప్.. ఇప్పుడు మరింత కఠినంగా ఉండొచ్చనే అంచనాలు భయపెడుతున్నాయి.
Donald trump: ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు. ఫ్లోరిడాలోని ట్రంప్ మార్ ఏ లాగో ఎస్టేట్‌లో విందులో వీరిద్దరు పాల్గొన్నారు. ఇరువురు మధ్య చర్చ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అధిక సుంకాలను నివారించేందుకు కెనడాను యునైడెట్ స్టేట్స్లో "51వ రాష్ట్రం"గా చేయడంపై జోక్ చేశారు.
హమాస్ ఉగ్రవాద సంస్థకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించ ముందే.. హమాస్ తన వద్ద బందీలుగా ఉంచుకున్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దురాగతాలకు పాల్పడే వారికి నరకం చూపిస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్రూత్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘అమెరికా అధ్యక్షుడిగా 20 జనవరి 2025న…