Zohran Mamdani: 33 ఏళ్ల డెమోక్రటిక్ లీడర్ జోహ్రాన్ మమ్దానీ మేయర్ ప్రైమరీలో విజయం సాధించి, న్యూయార్క్ మేయర్ పీఠానికి అతి చేరువులోకి వెళ్లారు. అయితే, ఈ విజయం పట్ల ముఖ్యంగా అధికారంలో ఉన్న రిపబ్లిక్ పార్టీతో పాటు, ‘‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్(MAGA)’’ మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో రాత్రికి రాత్రే తన ఓటమిని అంగీకరించారు. న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ ఎన్నికైతే, న్యూయార్క్ నగర చరిత్రలో మొదటి భారతీయ-అమెరికన్, ముస్లిం మేయర్ చరిత్ర సృష్టించినవారు అవుతారు.
అయితే, మమ్దానీ విజయంపై అమెరికాలో సోషల్ మీడియా వ్యాప్తంగా ‘‘ఇస్లామోఫోబిక్’’ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. జార్జియాకు యూఎస్ రిప్రజెంటివ్‌గా ఉన్న మార్జోరీ టేలర్ గ్రీన్ ఏకంగా ‘‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’’కి బూర్ఖాతో ముసుగు కప్పిన చిత్రాన్ని పంచుకున్నారు. మరో మాగా సపోర్టర్ డాన్ కీత్ ‘‘కంగ్రాచ్యులేషన్ న్యూయార్క్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరో యూఎస్ ప్రతినిధి నాన్సీ మెస్, మమ్దానీ కుర్తా పైజామా ధరించిన ఫోటోని షేర్ చేసి, ‘‘9/11 ఘటన మేము మర్చిపోకూడదు అని అనుకున్నాము, కానీ బాధకరంగా దానిని మరిచిపోతున్నాము’’ అని కామెంట్ చేశారు.
Congratulations New York. pic.twitter.com/UhOKJSCcSN
— Don Keith (@RealDonKeith) June 25, 2025
మరికొందరు యూజర్లు, ‘‘2025లో ముస్లిం జిహాదిస్టును ఎన్నుకుంటారు, 2040లో న్యూయార్క్‌లో షరియా చట్టాన్ని పాటించండి, 2060లోకి ఇస్లాంలోకి మారండి లేదా చనిపోండి’’ కామెంట్ చేశారు. మరొకరు ‘‘న్యూయార్క్ దాని సొంత పతనానికి ఓటు వేయడం మూర్ఖత్వం. జిమాదిస్ట్ డెమొక్రాట్ అభ్యర్థి ప్రైమరీ గెలిచి ఉండవచ్చు, కానీ అతను మేయర్ అవుతాడని అర్థం కాదు. కానీ అతను నిజంగా గెలిస్తే, గుడ్డిగా తన సొంత నగర పతనానికి ఓటువేసి శిక్షను ఎంచుకుంటారు’’ అని కామెంట్ చేశారు.
After 9/11 we said "Never Forget."
I think we sadly have forgotten. pic.twitter.com/f3iCXKUIRa
— Nancy Mace (@NancyMace) June 25, 2025