Iran-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాత రెండు దేశాలు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ అయ్యారు. రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం ఉందని.. సైనికులను వెనక్కి రప్పించాలంటూ ఇజ్రాయెల్ ను ఆదేశించారు. దీంతో దాడులు చేసినట్టు ఒప్పుకున్న ఇజ్రాయెల్.. తమ అధినేత నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడిన తర్వాత దాడులు ఆపేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.
Read Also : Rammohan Naidu : బ్లాక్ బాక్స్ పై ఇండియాలోనే విచారణ : రామ్మోహన్ నాయుడు
ఇక నుంచి మరో దాడి చేయబోమని వెల్లడించింది. అటు ట్రంప్ కూడా దీనిపై స్పందించారు. రెండు దేశాల మధ్య 12 రోజుల యుద్ధానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించారు. ‘సీజ్ ఫైర్ ఒప్పందం చేసిన తర్వాత ఇరాన్ మాపై మూడు చోట్ల దాడులు చేసింది. అందుకే మేం ఇరాన్ రాడార్ వ్యవస్థలపై దాడులు చేశాం’ అంటూ ఇజ్రాయెల్ వెల్లడించింది.
అయితే ఒప్పందాన్ని తాము ఉల్లంఘించామని ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము అస్సలు ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని తెలిపింది. సీజ్ ఫైర్ ఒప్పందం కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు రెండు దేశాలు ప్రకటించాయి.
Read Also : DGCA : దేశంలోని ప్రధాన ఎయిర్ పోర్టుల్లో ‘సర్వేలెన్స్’..