Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత దూషణల పర్వానికి దిగారు. భారత సంతతికి చెందిన న్యూయార్క్ మేయర్ అభ్యర్థి మమ్దానీపై పరుష పదజాలంతో విరుచుకు పడ్డారు. మమ్దానీ భయంకరమైన వ్యక్తి.. అతని గొంతు గరుకుగా ఉంటుంది.. అతడు అసలు తెలివైనవాడే కాదని మండిపడ్డారు. న్యూయార్క్ నగరంలో జరిగిన డెమోక్రటిక్ మేయర్ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వామపక్ష సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ గెలిచారు. ఈ విజయంపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. మమ్దానీ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి.. 100 శాతం కమ్యూనిస్ట్ పిచ్చివాడు అని అభివర్ణించారు. మరోవైపు, మమ్దానీకి న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో మద్దతు ఇచ్చారు. దీంతో అతడిపై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు.
Read Also: Crime News: ఏడేళ్ల కొడుకుకు మందు తాగించిన తండ్రి.. చివరకు ఏమైందంటే?
ఇక, న్యూయార్క్ లో ఏం జరగాలో అదే జరిగింది.. డెమొక్రాట్లు హద్దు మీరారు.. 100 శాతం కమ్యూనిస్ట్ పిచ్చివాడైన జోహ్రాన్ మమ్దానీ ప్రైవరీని ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ దిశగా పయనిస్తున్నాడు. మనకు ఇంతకు ముందు రాడికల్ లెఫ్టీలు ఉన్నారు.. కానీ, ఇది కొంచెం హాస్యాస్పదంగా మారుతోందని ట్రూత్ సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. అయితే, పాలస్తీనా మద్దతుదారు వ్యక్తికి మద్దతు ఇవ్వడమేంటి? అని డెమొక్రాట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్దానీ, భారత సంతతికి చెందిన ముస్లిం వ్యక్తి.. ఉగాండా మార్క్సిస్ట్ పండితుడు మహమూద్ మమ్దానీ కుమారుడు.. అతడికి 43.5 శాతం ఓట్లతో గెలిచాడు. 90 శాతం బ్యాలెట్లు లెక్కించబడ్డాయి. మమ్దానీ ఫైనల్ రేసులో కూడా గెలిస్తే.. న్యూయార్క్‌కు తొలి ముస్లిం వ్యక్తి మేయర్‌గా ఎన్నికైన రికార్డ్ అతని సొంతం అవుతుంది.