Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తానే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చేసేలా ఒప్పించానని చెప్పాడు. ఇప్పటికే ఈ విషయాన్ని 20 కన్నా ఎక్కువ సార్లు ట్రంప్ చెప్పాడు. మరోవైపు, ట్రంప్ వ్యాఖ్యలపై భారతదేశంలో రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. ప్రధాని మోడీ ట్రంప్‌కు లొంగిపోయాడని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇలా ఉంటే, పాకిస్తాన్ డీజీఎంఓ, భారత డీజీఎంఓకి కాల్ చేసి, కాల్పుల విరమణను కోరడంతోనే సాధ్యమైందని, ట్రంప్ మాటల్లో నిజం లేదని భారత ప్రభుత్వం పలుమార్లు చెప్పింది.
Read Also: Chairman’s Desk: హిందూ మతానికి, రాజకీయానికి సంబంధమేంటి..? హిందువులకు కొత్త పాఠాలేంటి..?
ఇదిలా ఉంటే, తాగా ఆయన థాయిలాండ్-కంబోడియా యుద్ధాన్ని కూడా ఆపినట్లు చెప్పారు. ఇరు దేశాలు శత్రుత్వాన్ని నిలిపేయాలని, వాణిజ్య ఒప్పందాలను నిలిపేస్తానని హెచ్చరించినట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘నేను భారత్-పాకిస్తాన్ మధ్య సంఘర్షణను నిరోధించాను, ఇప్పుడు థాయిలాండ్-కంబోడియా యుద్ధాన్ని ముగించాను’’ అని అన్నారు.
థాయిలాండ్, కంబోడియాలతో అమెరికా చాలా వాణిజ్యం చేస్తుందని ట్రంప్ చెప్పారు. తాను ఇరు దేశాల ప్రధాన మంత్రులకు ఫోన్ చేసి, వారు యుద్ధాన్ని ముగించకుంటే ఎలాంటి వాణిజ్య ఒప్పందం ముందుకు సాగదని హెచ్చరించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ.. థాయిలాండ్ తమపై దాడులు చేస్తోందని కండోడియా ఆరోపించింది.