డాక్టర్లను మనం దేవుళ్లతో పోలుస్తాం. ఎందుకంటే.. ప్రాణపాయ స్థితి నుంచి కాపాడుతారు కాబట్టి! ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలొచ్చినా, దాన్ని నయం చేస్తారనే నమ్మకంతో రోగులు వారి వద్దకే వెళ్తారు. అందుకే.. రోగి కోసం డాక్టర్ వెయిట్ చేయొచ్చు గానీ, డాక్టర్ కోసం రోగి వెయిట్ చేయకూడదంటారు. బహుశా కాసేపు వేచి చూసినా, డాక్టర్ వస్తాడన్న నమ్మకమూ రోగుల్ని బ్రతికిస్తుంది. కానీ, ఆ నమ్మకమే ఒమ్మై డాక్టర్లు అందుబాటులోకి రాకపోతే? ఆ రోగి పరిస్థితి ఏంటి? సరిగ్గా…
షుగర్ వ్యాధిగ్రస్తులు బాగా పెరిగిపోతున్నారు. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, అస్తవ్యస్త మయిన జీవనవిధానం, కాలుష్యం వంటి కారణాల వల్ల డయాబెటిస్ రోగులు పెరిగిపోతున్నారు. డయాబెటిస్ వున్న ఆహారం విషయంలో నిబంధనలు పాటించాల్సి వుంటుంది. తిండి విషయంలో అన్నీ వున్నా కట్టడి చేసుకోవాల్సి వస్తుంది. ఏది తినాలన్నా ముందు వెనుకా ఆలోచించాలి. షుగర్ కారణంగా ఎలాగూ స్వీట్లు తినలేరు.. ఆరోగ్యాన్నిచ్చే పండ్లు తినాలన్నా ఎన్నో సందేహాలు. ఫ్రూట్స్ లోనూ చక్కెరస్థాయిలు ఉంటాయి కాబట్టి ఏవి తినొచ్చు.. ఏవి…
ప్రస్తుతమున్న కాలంలో జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తినే ఆహారం, జీవన విధానంలో మార్పులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో ఉత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల మానవుడు ఆరోగ్యం బారిన పడుతున్నాడు. మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. జీవన విధానంలో మార్పులు చేసుకుంటే సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక జీవన శైలి కారణంగా అనారోగ్య సమస్యలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్లు బారిన పడేవారు…
అప్రమత్తంగా వుండాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నా జనం మోసపోతూనే వున్నారు. ఎవరైనా సరే బ్యాంక్ ఖాతా, ఓటిపి గురించి అడిగినా వివరాలు చెప్పవద్దని పోలీసులు సూచిస్తూనే వున్నారు. అటువంటి కేటుగాళ్ళ కోసం నిఘా నేత్రాలు ఏర్పాటు కూడా చేశారు తెలంగాణ పోలీసులు. ప్రజలను మోసంచేసి డబ్బులు కాజేస్తున్న వారిపై వేటు వేస్తూ.. కఠిణ శిక్షలు అమలు చేస్తున్నా అలాంటి కేటుగాళ్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తునే వున్నారు. అయితే.. అటువంటి ఘటనే సిద్దిపేట జిల్లా…
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారుల బదిలీలపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రక్షాళన పేరుతో అనర్హులను అందలం ఎక్కించారని మండిపడుతున్నారు వైద్యాధికారులు. ఏళ్లుగా పని చేయకుండా ఉన్న సీనియర్లను తప్పించేందుకు ఆకస్మిక బదిలీలు చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో ముగ్గురు జిల్లా వైద్యాధికారులను బదిలీ చేసింది. మేడ్చల్ జిల్లా DMHO డాక్టర్ మల్లికార్జున్‌ను యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా పనిజేస్తున్న డాక్టర్ పుట్ల శ్రీనివాసుకు DMHOగా పోస్టింగ్ ఇచ్చారు. యాదాద్రి…
తెలంగాణ వ్యాప్తంగా రోగులకు ప్రిస్కిప్షన్‌పై మందులు రాసే విషయంలో వైద్యులకు రాష్ట్ర వైద్య మండలి కీలక ఆదేశాలను జారీ చేసింది. జనరిక్ మెడిసిన్ పేర్లనే ప్రిస్కిప్షన్‌లలో రాయాలని సూచించింది. ఔషధాల బ్రాండ్ నేమ్ మాత్రం రాయవద్దని ఆదేశాలు జారీ చేసింది. మెడిసిన్ బ్రాండెడ్ పేర్లకు బదులుగా వాటిలోని కాంపౌండ్ మెడిసిన్‌లనే పేర్కొనాలంటూ గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను వైద్య మండలి గుర్తుచేసింది. మందుల చీటీల్లో బ్రాండ్ నేమ్ పేర్కొనరాదని ఇటీవల భారతీయ వైద్య మండలి, లోకాయుక్త కూడా…
వైద్య రంగంలోకి కొన్ని అద్భుతమైన ఘట్టాలు వెలుగుచూస్తూ ఉంటాయి.. దేనికోసమో తయారు చేసిన మందు.. మరో రోగాన్ని నయం చేస్తుంది.. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాక జుట్టు పీకోవాల్సిన పరిస్థితులు తెచ్చిపెట్టిన సందర్భాలు ఎన్నో.. తాజాగా, అలాంటి ఘటనే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.. ప్రపంచం వెన్నులో వణుకుపుట్టిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు తయారు వేస్తున్న వ్యాక్సినేషన్‌తో.. మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి అమాంతం లేచి నిలబడ్డాడు.. నోట మాటలు రాని ఆ…
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నాలుగు వారాల పాటు ప్రభుత్వ డాక్టర్లు, నర్సుల సెలవులను రద్దు చేసింది. థర్డ్ వేవ్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సిద్ధం చేయాలంటూ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. Read Also: ఆశావర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త కాగా తెలంగాణలో మంగళవారం…
భారత్‌లో మళ్లీ కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది.. రోజువారి కేసుల సంఖ్య మళ్లీ 90 వేలను దాటేసింది.. ఇదే సమయంలో.. కనిపించని మహమ్మారితో ముందుండి పోరాటం చేసే వైద్యులు కూడా పెద్ద సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్నారు.. ఇప్పటికే మహారాష్ట్రలోని ముంబైలో 230 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో మరో 30 మంది వైద్యులకు కరోనా సోకింది. Read Also: టీనేజర్ల జోష్.. 3 రోజుల్లోనే 1.24…
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. బీహార్‌లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బీహార్‌లోని నలంద మెడికల్ కాలేజీలో సోమవారం 72 మంది డాక్టర్లు కరోనా బారిన పడగా… తాజాగా మరో 59 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 143 మంది డాక్టర్లు కరోనాతో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత మూడు, నాలుగు రోజులుగా ఆయా డాక్టర్లను కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.…