Doctors Dutymind: అడవిలో నడిచి.. ఆదివాసీలకు వైద్యం అందించి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాక్టర్లంటే టిప్ టాప్ గా తయారై ఆస్పత్రికి వచ్చి రోగుల్ని చూసేసి తమ టైం కాగానే అక్కడినించి వెళ్ళిపోతారు. డాక్టర్లంటే దేవుళ్లతో సమానం. వైద్యో నారాయణో హరి అంటారు. అంటే దేవుడు ప్రాణం పోస్తే.. ఆ ప్రాణాన్ని నిలిపేవాడు డాక్టర్. గిరిజన ప్రాంతాల్లో, కొండ కోనల్లో వైద్యం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే కొండ ప్రాంతాలకు వెళ్లాలంటే నడవాల్సిందే.. అది వాగులు వంకలు బురదమయం దాటుతూ రాళ్లదారిలో నరక యాతనతో నడక సాగాల్సిందే.. అటువంటి మారుమూల ప్రాంతంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది అడవి బాట పట్టారు.

Also Read
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
Read Also: Ananya Panday: అతనికి బ్రేకప్ చెప్పి.. మరో స్టార్ హీరోతో ఎఫైర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలోని మారుమూల గిరిజన పల్లె పెద్దమిద్దిలో వినాయకపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ రాందాస్ నేతృత్వంలో వైద్య బృందం మొద్దులమడ గ్రామం నుండి దట్టమైన అటవీ ప్రాంతం గుండా కొంత దూరం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి పెద్దమీది చేరుకొని వైద్య సేవలు అందించారు. దోమల నివారణ సీజనల్ వ్యాధులపై అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు.
22 ఇళ్లల్లో దోమల నివారణ మందు సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పిచికారి చేసి 44 దోమల తెరలను పంపిణీ చేశారు. వైద్య శిబిరంలో 52 మందికి పరీక్షించి చిరు వ్యాధులకు చికిత్స అందించారు. ఇద్దరు జ్వరం పీడితులను గుర్తించి రక్త పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. నడిచి వెళ్లడానికి కూడా వీలులేని అటవీ మార్గంలో మందులు, వైద్య పరికరాలు మోస్తూ వెళ్లి వైద్య సేవలు అందించిన వినాయకపురం PHC బృందం కృత నిశ్చయం ప్రశంసనీయం.. అరణ్యంలో నాటు వైద్యమే శరణ్యంగా జీవించే వారి వద్దకు ప్రభుత్వ సేవలు తీసుకెళ్లిన వారి ప్రయాస అభినందనీయం. అడవిలో నడిచి వైద్య సేవలు అందించిన వైద్యుల్ని, సిబ్బందిని అంతా ప్రశంసిస్తున్నారు. డాక్టర్లంటే ఇలా వుండాలంటున్నారు జనం.

Read ALso: Amaravathi: అమరావతికి శంకుస్థాపన జరిగి నేటితో ఏడేళ్లు.. ఫోటో పోస్ట్ చేసిన చంద్రబాబు
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు