మాజీ ఎంపీ నందిగం సురేష్కు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ అస్వస్థతకు గురి కావడంతో.. జిల్లా జైలు అధికారులు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌లో ఉన్న వైద్యులకు పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 తమకు రావాల్సిన సీట్లను దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు విజ్ఞాపన పత్రం అందచేశారు.
ప్రధాని మోడీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది.. అన్ని ఆస్పత్రులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. ఐఎంఏతో ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సమావేశం అయ్యారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరింది.
హైదరాబాద్ నగరంలో మునుపెన్నడూ లేనంతగా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. బాబోయ్.. అంటూ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Curd: రోజు పెరుగు తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందిస్తాయి. పాలలో ఉండే దాని కంటే కంటే పెరుగులో ఎక్కువప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి హెర్నియా కోసం శస్త్రచికిత్స చేశారు. ఆ సమయంలో డాక్టర్లు షాక్ కు గురయ్యారు. అతని శరీరం లోపల స్త్రీ పునరుత్పత్తి అవయవాలను కనుగొన్నారు.
Viral Fever: తెలంగాణ రాష్ట్రంలో వైరల్ ఫీవర్ విజృంభిస్తోంది. ఏ హస్పటల్ ను చూసిన పేషంట్స్ తో కిటకిటలాడుతోంది. వందల్లో ఉండే ఔట్ పేషెంట్స్ (ఓపీ) కేసులు కాస్త వేలలో నమోదు అవుతున్నాయి.