మాజీ ఎంపీ నందిగం సురేష్కు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ అస్వస్థతకు గురి కావడంతో.. జిల్లా జైలు అధికారులు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. నిన్న రాత్రి నుండి షుగర్, బీపీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నానని.. భుజం నొప్పి కూడా తోడవడంతో, ఛాతిలో నొప్పిగా ఉందంటూ నందిగం సురేష్ జిల్లా జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు.
Read Also: Viral Video: “అది కొండచిలువ.. బల్లిని కాదు గురూ..” బాల్కనీలో పాము కోసం వెతుకుతూ..
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను హుటా హుటిన ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అయితే.. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఈసీజీ తదితర పరీక్షలు నార్మల్ గానే ఉన్నాయని.. భుజం నొప్పితో బాధపడుతున్న సురేష్ దానిని చాతి నొప్పిగా భావించారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. పరీక్షలన్నీ సాధారణంగా ఉండటంతో.. తిరిగి నందిగం సురేష్‌ను జిల్లా జైలుకు తరలించారు అధికారులు.
Read Also: Festival Rush: బెజవాడలో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్, రైల్వే స్టేషన్..