Toothbrush: టూత్ బ్రష్ అనేది దంతాలతో పాటు చిగుళ్లు మరియు నాలుకను శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తారు.. అయితే, దంతాలు శుభ్రం చేసుకొనేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. కొందరు బ్రష్ వేసుకొని ఊరంతా తిరిగేస్తుంటారు.. మరికొందరు.. బ్రష్ నోట్లో పెట్టుకుని ఏదో పనిలో మునిగిపోతారు.. టూత్ బ్రష్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేదంటే.. ప్రమాదాన్నా కోరి తెచ్చుకున్నట్టే.. ఎందుకంటే.. బ్రష్ రెండు నిమిషాలపాటు శ్రద్ధగా వేస్తే సరిపోతుందని వైద్యులే చెబుతున్నారు.. అయితే, పళ్లు తోముతుండగా జరిగన ఓ ఊహించని ఘటన.. ఓ బాలుడికి చుక్కలు చూపించింది.. దవడలోకి టూత్ బ్రష్ చొచ్చుకుపోవడంతో.. చివరకు ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సిన పరిస్థితి నెలకొంది..
Read Also: Traffic Diversion: నేడు హైదరాబాద్‌లో రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు..
శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో పళ్లు తోముతున్న బాలుడు దవడలో టూత్ బ్రష్ గుచ్చుకుంది.. బాలుడు బ్రష్ చేస్తుండగా.. ఒక్కసారిగా కింద పడడంతో దవడలోకి చొచ్చుకుపోయింది టూత్ బ్రష్.. దీంతో విలవిలలాడిపోయాడు ఓ బాలుడు.. వెంటనే బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు తల్లితండ్రులు.. ఇక, బాలుడికి ఆపరేషన్ చేసి బ్రష్ ను తొలగించారు వైద్యులు.. ప్రస్తుతం బాలుడు ప్రవీణ్ కుమార్ (11) ఆరోగ్యం నిలకడగా ఉంది.. అయితే, బ్రష్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు..