Tamil Nadu: లోక్సభ పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తమిళనాడులో అధికార డీఎంకే వర్సెస్ బీజేపీలా రాజకీయం నడుస్తోంది. ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
Annamalai: తమిళనాడులో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. అధికార డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కోయంబత్తూర్లో అత్యాధునిక క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇవ్వడంపై
Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై అధికార డీఎంకే పార్టీపై విరుచుకుపడ్డారు. కోయంబత్తూర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన ఈ రోజు భారీ రోడ్ షో నిర్వహించారు.
DMK: లోక్సభ ఎన్నికలు దగ్గపడుతున్న కొద్దీ పార్టీలు తమ ప్రచార తీవ్రతను పెంచాయి. తొలి విడతలోనే తమిళనాడులోని అన్ని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార డీఎంకే బీజేపీ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తోంది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కచ్చతీవు ద్వీపం అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది. 1974లో ఆ ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ.. శ్రీలంకకు అప్పగించారని కమలం పార్టీ ఆరోపించింది.
Katchatheevu Row: భారత్-శ్రీలంక మధ్య ఉన్న కచ్చతీవు ద్వీపం ఇప్పుడు ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. లంక ఆధీనంలో ఉన్న ఈ చిన్న ద్వీపం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కే. అన్నామలై ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారం కాంగ్రెస్, డీఎంకే పార్టీలను ఇబ్బందుల్లో పడేసింది.
MK Stalin: తమిళనాడులో లోక్సభ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. అధికార డీఎంకే, బీజేపీ మధ్య విమర్శల దాడి జరుగుతోంది. సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీ, ప్రధాని మోడీ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు.
Kamal Haasan: నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోడ్ ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కేఈ ప్రకాష్కి మద్దతుగా ప్రచారం చేశారు. తమిళనాడుకు కేంద్రం ఇస్తున్న పన్నుల వాటాను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రభుత్వానికి అందించిన ప్రతీ రూపాయిలో కేవలం 29 పైసలు మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తున్నట్లు ఆరోపించారు.
డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇవాళ (శనివారం) ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్న ఓ ఛాయ్ దుకాణంలోకి వెళ్లి.. అక్కడ ఛాయ్ పెట్టించుకుని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాగారు.
PM Modi: శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, డీఎంకే మంత్రి అనితా రాధాకృష్ణన్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ)కి బీజేపీ ఫిర్యాదు చేసింది. పీఎంని కించపరిచే విధంగా ఇద్దరు నేతలు వ్యాఖ్యలు చేశారని మంగళవారం ఫిర్యాదు చేశారు. విదర్భ ప్రాంతంలోని బుల్దానాలో జరిగిన ర్యాలీలో సంజయ్ రౌత్ ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీని ఔరంగజేబులో పోల్చారు. తమిళనాడు పశుసంవర్థక శాఖ మంత్రి అని రాధాకృష్ణన్ రాష్ట్రంలో జరిగిన ఓ సభలో ప్రధానిపై అవమానకరమైన…