Annamalai: డీఎంకే ఓ ‘దుష్టశక్తి’.. తమిళ ప్రజల్ని ప్రధాని మోడీ కాపాడుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడులో పొలిటికల్ హీట్ పీక్స్‌కి చేరింది. అధికార డీఎంకే, బీజేపీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై అధికార డీఎంకేపై విరుచుకుపడ్డారు. డీఎంకే పార్టీని ‘దుష్టశక్తి’గా అభివర్ణించారు. ఈ దుష్టశక్తి నుంచి తమిళ ప్రజల్ని ప్రధాని నరేంద్రమోడీ కాపాడుతారని అన్నారు. గురువారం ఆయన డీఎంకే పార్టీ, ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. తాను నిఘా నీడలో ఉన్నానని, తన సన్నిహితులపై డీఎంకే నిఘా పెట్టిందని ఆరోపించారు.
Read Also: Pakistan: పేదరికంతో తిండి పెట్టలేక.. భార్య, ఏడుగురు పిల్లల్ని నరికి చంపిన వ్యక్తి..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
తమిళనాడులో నీట్ మినహాయింపుతో సహా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 23 ప్రశ్నలు సంధించడంపై అన్నామలై విలేకరులతో మాట్లాడారు. గోపాలపురంకి చెందిన అవినీతి రాజకీయ నాయకులను శిక్షిస్తానని మోడీ హామీ ఇచ్చారని, ఇది డీఎంకేకి సూచన అని అన్నారు. తమిళ ప్రజలకి డీఎంకే కుటుంబ పాలన నుంచి విముక్తి చేస్తామని అన్నారు. వేర్పాటువాదంపై మాట్లాడే వారిని నిలువరిస్తామని చెప్పారు.
తమిళనాడులోని పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం తనపై, తన కుటుంబ సభ్యులపై, స్నేహితులపై నిఘా పెట్టిందని అన్నామలై పేర్కొన్నారు. కోయంబత్తూర్‌లో పార్టీ ఆఫీస్ బేరర్లు, మద్దతుదారులపై నిఘా పెట్టేందుకు ఇంటెలిజెన్స్ నిఘా విభాగాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతీ అధికారి సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీఎంకేకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం అంత తేలికైన పని కాదని అన్నారు. తనకు పూలమాలలు వేసి స్వాగతం పలికిన పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తున్నారని అన్నామలై ఆరోపించారు. తాను ఓ విద్యాసంస్థను సందర్శించిన సమయంలో విద్యుత్ కోతల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా..? రాష్ట్రంలో నిజాయితీ పాలన ఉందా..? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!