Surya Jyothika Diwali Celebrations : సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ హీరో సూర్య నివాసంలో జరిగిన దీపావళి వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు విశేషాలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. సూర్య, కార్తీ, బృందంతో దీపావళి పండుగ సరదాగా జరుపుకున్నట్లు రాసుకొచ్చారు. సూర్య, కార్తీ ఫ్యామిలీలతో కలసి ‘కమాన్ బేబీ లెట్స్ గో బుల్లెట్టు’ అనే సాంగ్కి డాన్స్ వేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…
రాష్ట్రవ్యాప్తంగా దీపావళి పండగను ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమిదల పండగ దీపావళి కోలాహలం నెలకొంది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలంతా సంతోషంతో పండుగను జరుపుకుంటున్నారు .
PM Narendra Modi celebrates Diwali with army: సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, భారత సైనికులతో దీవపాళి వేడుకలను జరుపుకున్నారు. కార్గిల్ సెక్టార్ లో భారత సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రతీ దీపావళిని సైనికులతోనే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైనికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అధికారం లేకుండా శాంతిని పొందడం అసాధ్యమని సైనికులతో అన్నారు. తమ ప్రభుత్వం యుద్ధాన్ని చివరి ఎంపికగా భావిస్తుందని ప్రధాని అన్నారు.
దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా దీపావళిని స్థానిక ఉత్పత్తులతో జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్ సూచించారు.
శ్రీరాముడు నడయాడిన అయోధ్య నగరం దీపాల కాంతుల్లో వెలుగులు చిందించింది. ఈ సారి దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా సరయు నది ఒడ్డున 15 లక్షలకు పైగా దీపాలు వెలిగించి అయోధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధికారిక నివాసంలో శుక్రవారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. కమలా హారిస్ తమ భర్తతో కలిసి వాషింగ్టన్‌లోని తమ నివాసంలో దీపావళి వేడుకలను జరుపుకున్నారు.