సాగరతీరం, రాబోయే రోజుల్లో ఏపీ పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో దీపావళి సందడి మూడు రోజుల నుండే మొదలైంది.. నగర పరిధిలో 400 వందలకు పైగా క్రాకర్స్ షాప్స్ కు అనుమతులు ఇచ్చారు అధికారులు… మరోవైపు దీపావళి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి… అయితే విశాఖ బీచ్ రోడ్డు లో దీపావళి వేడుకలు పై పోలీసులు ఆంక్షలు విధించారు… బీచ్ రోడ్ లో ఎవరు కూడా దీపావళి మందుగుండు సామాగ్రి పేల్చకూడదని హెచ్చరికలు జారీ చేశారు… ఆంక్షలు మితిమీరిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Read Also: Diwali Sanctions In Vizag: విశాఖలో అక్కడ దీపావళి వేడుకలు నిషేధం.. ఎందుకో తెలుసా?
కుటుంబ సమేతంగా కలసి సందడిగా చేసుకునే పండగ దీపావళి. కొవిడ్ నిబంధనలు తొలగిపోవడంతో ఈ ఏడాది దివ్వెల పండగను ఘనంగా నిర్వహించడానికి విశాఖ నగర వాసులు సిద్ధమయ్యారు. బాణసంచా విక్రయ కేంద్రాలన్నీ అనుమతులకు అనుగుణంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు… జనావాసాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులకు దూరంగా బాణసంచా విక్రయాలు ఏర్పాటు చేశామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. బీచ్ రోడ్ లో బాణాసంచా కాల్చవద్దని హెచ్చరికలు జారీ చేశారు విశాఖ పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్.
ప్రమాదాలకు తావు లేకుండా పండగ నిర్వహించుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు కాలుష్య రహిత టపాసులనే కాల్చాలని పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ సూచించారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వాలని కోరారు. దీపావళి అంటే భారీ శబ్దాలు చేసే టపాసుల పండగ కాదని.. దీపాల వెలుగులతో ఆనందించే పండగ అంటున్నారు విశాఖలోని పర్యావరణ ప్రేమికులు. కరోనా సమయంలో రసాయనాలు వెదజల్లే బాణసంచా కాల్చడం వల్ల మరింత ప్రమాదమని అంటున్నారు. దీపాలు వెలిగించి దీపావళి జరుపుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీపావళి రోజు హీరోయిజం చూపించాలని ప్రయత్నిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీచేశారు.
(విశాఖ ప్రతినిధి చిరంజీవి సౌజన్యంతో..)
Read Also: Venkatesh: ఓరి దేవుడా.. 15 నిమిషాలకే వెంకీ మామ అన్ని కోట్లు తీసుకున్నాడా..?