ఎంతో ఆనందంగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకొనే దీపావళి పండుగ రోజు అపశృతి చోటు చేసుకుంది. మెహదీపట్నంలో దీపావళి వేడుకలు మొదలై టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు పలువురి కంటికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి తరలించారు. దీపావళి సందర్బంగా టపాసులు కాలుస్తుండగా ఏడుగురు గాయాలయ్యాయని.. వారిలో ఐదుగురికి ప్రథమ చికిత్స చేసి అనంతరం ఇంటికి పంపించినట్లు సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ఆర్ఎంవో నాజాఫి బేగం తెలిపారు. మరో ఇద్దరిని మాత్రం…
వాషింగ్టన్ డీసీలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ దీపావళి వేడుకల్లో అమెరికా ప్రజాప్రతినిధులు పాల్గొనడం విశేషం. అంతేకాకుండా చీకటిని తొలగించే సత్యం, జ్ఞానాన్ని దీపావళి మనకు గుర్తు చేస్తుంది అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నేషనల్ డెమొక్రటిక్ క్లబ్‌లో ప్రముఖులు దీపాలు వెలగించారు. ఎన్‌ఆర్‌ఐలు, అమెరికన్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తొలిసారిగా ప్రపంచ వాణిజ్య సంస్థ భవనాలపై దీపావళి థీమ్‌ను ప్రదర్శించారు. న్యూయార్క్‌లోని హడ్సన్ నదీతీరంలో…
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” వేదికపై ఈరోజు ఘనంగా వేడుకలు జరగనున్నాయి. నవంబర్ 4న దీపావళి కావడంతో కాస్త ముందుగానే అంటే ఈ వీకెండ్ ఆదివారం “బిగ్ బాస్ 5” వేదికపై దీపావళి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ప్రోమోను చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది. టీవీ పరిశ్రమలోని ప్రముఖ నటులతో పాటు, సినీ ప్రముఖులు కూడా షోలో పాల్గొన్నారుజరుపుకుంటారు. ఈ ప్రత్యేక దీపావళి ఎపిసోడ్‌లో వినోదం రెట్టింపు కావడంతో దీపావళి…