Tamilisai Soundararajan: దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా దీపావళిని స్థానిక ఉత్పత్తులతో జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్ సూచించారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో చీకటిని పారద్రోలి, కొత్త వెలుగులు విరజిమ్మి ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని తమిళిసై పిలుపునిచ్చారు.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు, సంతోషాలు, ఐశ్వర్యం, కొత్త ఆలోచనలు, ఆదర్శాలను తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. పటాకులు కాల్చే సమయంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని దీపావళి పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు నింపుతుందని సీఎం ఆకాంక్షించారు.
LIVE : లక్ష్మీపూజ, నరకచతుర్ధశి రోజున ఈ స్తోత్ర పారాయణం చేస్తే సుఖ సంతోషాలకు మీ ఇల్లు నిలయమవుతుంది