Ayodhya Sets World Record: శ్రీరాముడు నడయాడిన అయోధ్య నగరం దీపాల కాంతుల్లో వెలుగులు చిందించింది. ఈ సారి దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా సరయు నది ఒడ్డున 15 లక్షలకు పైగా దీపాలు వెలిగించి అయోధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఆదివారం అయోధ్యలో జరిగిన 6వ దీపోత్సవ వేడుకలో ప్రజలు దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. 15,76,000 దీపాలను వెలిగించడంలో 20,000 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్లో కూడా దీపాలను ఏర్పాటు చేశారు.
అయోధ్యలోని రామ్ కి పైడి ఘాట్‌ల వద్ద 15 లక్షల దీపాలను వెలిగించడం ద్వారా అయోధ్యలో దీపావళి నాడు అత్యధిక దీపాలను వెలిగించి ఉత్తరప్రదేశ్‌లోని అవధ్ విశ్వవిద్యాలయానికి చెందిన వాలంటీర్లు అయోధ్యలో రికార్డును కైవసం చేసుకున్నారు. వివిధ దేశాలకు చెందిన కళాకారులు ప్రధాని మోడీ సమక్షంలో రామ్‌లీలాను ప్రదర్శించారు. దీపోత్సవ వేడుకల్లో భాగంగా మోదీ శ్రీరామునికి లాంఛనప్రాయ పట్టాభిషేకం చేయడంతోపాటు సీతారాములకి, లక్ష్మణుడికి హారతి ఇచ్చారు. అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర స్థలాన్ని పరిశీలించిన ప్రధాని వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీటితో పాటే సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో దాదాపు రూ.4వేల కోట్ల విలువైన పథకాలకు శ్రీకారం చుట్టారు.
PM Modi in Ayodhya: అయోధ్య దీపోత్సవంలో ప్రధాని మోడీ.. సరయూ నది తీరంలో వేడుకలు
దీపోత్సవంలో పాల్గొనేందుకు అయోధ్యకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాముడు ఎవరినీ వదిలిపెట్టడు, ఎవరికీ దూరంగా ఉండడు అని ప్రధాని మోదీ అన్నారు. అంతకుముందు రోజు అయోధ్యలోని రామ జన్మభూమి వద్ద రామ్ లల్లాకు ప్రధాని మోదీ ప్రార్థనలు చేశారు. ఆగస్ట్ 5, 2020న రామ మందిర నిర్మాణం కోసం “భూమి పూజ” తర్వాత అయోధ్యకు ప్రధాని మోదీ రావడం ఇదే తొలిసారి.
#WATCH | Prime Minister Narendra Modi and UP CM Yogi Adityanath perform the Rajyabhishek of the symbolic Bhagwan Shree Ram in Ayodhya, Uttar Pradesh
(Source: DD) pic.twitter.com/EGEAr5nYbg
— ANI (@ANI) October 23, 2022