ఏపీలో జిల్లాల విభజనతో పలు జిల్లాల భౌగోళిక స్వరూపం మారిపోయింది. ఏపీలో గతంలో ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు వచ్చాయి. ఇదివరకు రాయలసీమలో 4, కోస్తాలో 9 జిల్లాలు అని సులభంగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో చెప్పడం కష్టమైన పనే. ఈ విషయంపై స్పష్టత రావడానికి కాస్త సమయం పడుతుంది. అయితే జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలో చాలా మార్పులు జరిగాయి. ఇదివరకు సముద్రతీరం ఉన్న గుంటూరు జిల్లాలో జిల్లాల…
ఏపీలో కొత్త జిల్లాల విభజనపై మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శలు చేశారు. వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఈరోజు దుర్దినం అని ఆయన అభివర్ణించారు. అప్పుడు రాష్ట్ర విభజన వల్ల ఎంత బాధపడ్డామో.. ఇప్పుడు జిల్లాల విభజన వల్ల అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ రెండు ఘటనలు ప్రజలకు చీకటి దినాలుగా నిలిచిపోతాయన్నారు. జిల్లాల విభజనతో వేమూరు నియోజకవర్గ ప్రజలకు తీరని నష్టం కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేమూరుకు శతాబ్దాలుగా తెనాలితో ఉన్న అనుబంధం…
ఏపీలో జిల్లాల విభజనకు సంబంధించి శనివారం అర్ధరాత్రి కొత్త నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. 26 జిల్లాలకు కొత్త కలెక్టర్ కార్యాలయాలు సిద్ధమయ్యాయి. దీంతో కలెక్టర్ కార్యాలయాల అడ్రస్‌లతో నోటిఫికేషన్ జారీ చేశారు. మరోవైపు జిల్లా పరిషత్‌ల విభజనపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో జిల్లా పరిషత్‍ల విభజన లేనట్లేనని ఆయన స్పష్టం చేశారు. జిల్లా పరిషత్‌ల విభజనపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని మంత్రి బొత్స తెలిపారు. ప్రస్తుతమున్న జిల్లా పరిషత్‌ల నుంచే…
ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీని సెలవుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారి ముత్యాలరాజు నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో ఏప్రిల్ 2న కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ఉగాది సెలవు లేదని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పలు విజ్ఞప్తులు రావడంతో అధికారులు సమీక్షించి కొత్త జిల్లాల ఏర్పాటును రెండు రోజుల పాటు వాయిదా వేశారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటు…
ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పాలనను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవైపు జిల్లాల పునర్విభజనపై వివిధ ప్రాంతాల్లో పలు డిమాండ్లు, అభ్యర్థనలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటిని పక్కకు పెట్టి పాలన అందించడంపైనే దృష్టి పెట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సుమారు 11వేల అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాలకు జిల్లా కేంద్రాలు మార్చాలని.. మరికొన్ని జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టాలని డిమాండ్లలో ఉన్నాయి. ప్రభుత్వానికి వచ్చిన 11వేల డిమాండ్లలో…
ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాల విభజనపై వస్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల విభజన పక్రియపై ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ స్పందించారు. విశాఖలో నాలుగు జిల్లాలకు సంబంధించిన అభ్యంతరాలు పరిశీలించామని.. వాటిలో ఏవి సహేతుకంగా ఉన్నాయో.. ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో అన్న విషయాన్ని పరిశీలించామని ఆయన తెలిపారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 12 జిల్లాల అభ్యంతరాలపై సమీక్ష…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా నడుస్తోందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయకుమార్ వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై మార్చి 3 దాకా అభ్యంతరాలు స్వీకరణ ఉంటుందన్నారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొత్త జిల్లాలలో ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందన్నారు. ఆర్డర్ టు వర్క్ ప్రాతిపదికన మాత్రమే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు…
జిల్లాల విభజన నేపథ్యంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్, పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద బోండా ఉమ నిరసన దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు రాధారంగ మిత్రమండలి నేత చెన్నుపాటి శ్రీను, కాపు సంఘం నేతలు మద్దతు పలికారు. అధికారం చేతిలో ఉందని జగన్ ప్రభుత్వం ఇష్టం…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ నాయకులు ఈరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు అంటూ కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. అటు శ్రీసత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష కూడా చేపట్టారు. అటు హిందూపురం కేంద్రంగా జిల్లా కోసం ఆమరణ దీక్షకు…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పలు ప్రాంతాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హిందూపురం జిల్లా కోసం హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన మౌన దీక్ష చేపట్టనున్నారు. ముందుగా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించి.. ఆ తర్వాత బాలయ్య దీక్ష చేపట్టనున్నారు. Read Also: రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలి: బైరెడ్డి శుక్రవారం…