రైటర్ బీవీయస్ రవి ఇప్పుడు చిత్రసీమలో బహుముఖ పాత్రలు పోషిస్తున్నాడు. ‘సత్యం’ సినిమాతో రైటర్ గా మారిన బీవీయస్ రవి అప్పట్లోనే ఒకటి రెండు సినిమాలలో నటించారు. గత యేడాది వచ్చిన రవితేజ ‘క్రాక్’లో సెటైరికల్ కామెడీ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. దాంతో ఆయనకు నటుడిగానూ పలు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా రవితేజ ‘ధమాకా’ చిత్రంలో బీవీయస్ రవి ఓ పాత్ర చేశాడు. తెర మీద తనను తాను చూసుకోవడం కంఫర్ట్ గా అనిపించిందని, ఇక మీదట…
“నవ్వడం యోగం… నవ్వించడం భోగం… నవ్వకపోవడం రోగం…” అంటూ ఓ నవ్వుల సూత్రాన్ని జనానికి పరిచయం చేశారు జంధ్యాల. ఇంటిపేరుతోనే రచయితలుగా ఎందరో వెలుగులు పంచారు. వారిలో పసందైన పదాలు పరిచయం చేసిన వారు ఎందరో. అలాంటి వారిలో జంధ్యాల పేరు వినగానె తెలుగుజనానికి కితకితలు పెట్టినట్టు ఉంటుంది. ఒకటా రెండా మరి, జంధ్యాల రచనలో జాలువారిన పదాలయితేనేమి, ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వినోదాల విందులయితేనేమి అన్నీ మనకు హాయిగా నవ్వుకొనే వీలు కల్పిస్తాయి. జంధ్యాల అన్నది…
ఆసక్తికరమైన సినిమాలతో రాబోతున్న హీరో సుధీర్ బాబు 15వ చిత్రం షూటింగ్ ఆరంభం అయింది. నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఎం. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావుతో కలిసి శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటి వరకూ కనిపించనటువంటి పాత్రలో సుధీర్‌బాబుని ప్రెజెంట్ చేయడానికి హర్షవర్ధన్ భిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఈ వినూత్నమైన సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజతో లాంఛనంగా…
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నాగార్జున తో ‘మన్మధుడు 2’ చిత్రం తీసి భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత రాహుల్ డైరెక్టర్ గా మరో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో తలమునకలవుతున్నట్లు రాహుల్ ఇటీవల తెలిపాడు. ఇకపోతే ఈ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు మాత్రమే ప్రాధాన్యం అని తెలిపాడు. ” నా తదుపరి…
పిడికెడు సినిమాలు తీసినా, గంపెడు పేరు సంపాదించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ నాటి క్రేజీ డైరెక్టర్స్ లో అనిల్ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. నవ్వించి, కవ్వించడంలో అందెవేసిన చేయి అనిపించుకున్నారు అనిల్. వినోదం కోరుకొనే వారికి నూటికి నూరుపాళ్లు సంతృప్తిని కలిగించడమే ధ్యేయంగా సాగుతున్నారాయన. ప్రేక్షకుడు కొన్న టిక్కెట్ కు సరిపడా సంతోషాన్ని అందించి మరీ పంపించడం అలవాటుగా చేసుకున్నారు. అనిల్ సినిమాలను చూసినవారెవరైనా ఆ మాటే అంటారు. అనిల్ రావిపూడి 1982 నవంబర్…
హిందీ చిత్రాలతోనూ వెలుగు చూసిన తెలుగు దర్శకులు ఎందరో ఉన్నారు. వారిలో తాతినేని రామారావు ప్రత్యేక స్థానం సంపాదించారు. మాతృభాష తెలుగులో విజయాలు సాధించిన తాతినేని రామారావు, దక్షిణాదిన సక్సెస్ చూసిన అనేక చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. అక్కడా జయకేతనం ఎగురవేశారు. తాతినేని రామారావు ఎన్ని సినిమాలు తీసినా, ఆయన పేరు వినగానే ‘యమగోల’ డైరెక్టర్ అనేవారు ఉన్నారు. ఆ సినిమాతో తాతినేని రామారావు పేరు మారుమోగి పోయింది. అందుకే ఇప్పటికీ ‘యమగోల’ తాతినేని రామారావుగానే…
ఎందరో రచయితలు దర్శకులుగా రాణించి అలరించారు. వారిలో కె. ప్రత్యగాత్మ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అనేక జనరంజకమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.ప్రత్యగాత్మ, హిందీలో కె.పి.ఆత్మగానూ కొన్ని చిత్రాలు రూపొందించారు. తెలుగులో జయలలిత నటించిన తొలి చిత్రం, చివరి చిత్రం రెండూ ప్రత్యగాత్మ దర్శకత్వంలోనే రూపొందడం విశేషం! కుటుంబ కథా చిత్రాల దర్శకునిగా పేరొందిన ప్రత్యగాత్మ చివరి వరకూ అదే తీరున సాగారు. ప్రత్యగాత్మ ఇంటిపేరు కొల్లి. కానీ, ఆయన తండ్రి పేరు కోటయ్య…
(ఆగస్టు 5న చక్రపాణి జయంతి) చక్రపాణి చమక్కు తెలుగు పాఠకులకు భలే ఇష్టం. ఆయన రాసిన అనువాద కథలు చదివి, అవి పరభాష కథలు కావని వాదించినవారూ ఉన్నారు. ఇప్పటికీ చక్రపాణి అనువాదించిన రచనలు చదివితే అలాగే అనిపిస్తుంది. రాతగాడు కావడంతో ఆబాలగోపాలాన్నీ అలరించేందుకే ఆలోచించేవారు చక్రపాణి. ఆయన మేధస్సు నుండి పురుడు పోసుకున్నదే ‘చందమామ’ మాస పత్రిక. ఆ రోజుల్లో పలు భాషల్లో ‘చందమామ’ జనాన్ని ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ‘చందమామ’ ఇంగ్లిష్ ప్రతి…
రైటర్ గా పలు విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన కొరటాల శివ, దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న తర్వాత అపజయాన్నే ఎరగలేదు. అయితే కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా తన చిత్రాలకు సంబంధించిన విశేషాలను, తన కార్యకలాపాలను కొరటాల శివ అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇక సోషల్ మీడియాలో కొనసాగాలనుకోవడం లేదని కొరటాల శివ తెలిపారు. ఇకపై మీడియా మిత్రుల ద్వారా తన చిత్రాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియచేస్తానని ఆయన చెబుతున్నారు. జనాలతో తన…
బాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా మారింది స్టార్ హీరోయిన్ తాప్సీ. సవాళ్లు విసిరే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ జీవితకథతో ‘శభాష్ మిథు’ చిత్రం తెరకెక్కుతోంది. వయాకామ్ 18 సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ను మార్చినట్టు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తారని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ తాజాగా సమాచారం మేరకు ఆయన స్థానంలో దర్శకుడిగా శ్రీజిత్…