చిత్రసీమలో రాణించాలని కలలు కనేవారు ఎందరో! తమ కలలను సాకారం చేసుకొని చిత్రసీమలో అలరించేవారు కొందరే! అలా ఎందరో ప్రతిభావంతులు తమదైన బాణీ పలికిస్తూ తెలుగు సినిమా రంగంలోనూ రాణిస్తున్నారు. కోరుకున్న తీరాలను చేరుకొని ఆనందిస్తున్నారు. అలాంటి వారిలో దర్శకుడు కొరటాల శివ ఒకరు. సినిమా రంగంలో దర్శకునిగా రాణించాలనే ఆయన కలలు కంటూ చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆరంభంలో రచయితగా అలరించన కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడయ్యారు. తొలి చిత్రంతోనే జయకేతనం ఎగరేశారు. ప్రస్తుతం మెగాస్టార్…
నటుడు విజయ్ చందర్ పేరు వినగానే చప్పున ఈ నాటికీ ‘కరుణామయుడు’ విజయ్ చందర్ అంటూ జనం గుర్తు చేసుకుంటారు. ఏసుప్రభువు జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘కరుణామయుడు’ చిత్రాన్ని నిర్మించి, ఏసు పాత్రలో నటించి, అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు విజయ్ చందర్. అప్పటి నుంచీ జనం మదిలో ఆయన ‘కరుణామయుడు’ విజయ్ చందర్ గానే నిలచిపోయారు. తెలుగునాట యన్టీఆర్ తరువాత పురాణ,చారిత్రక పాత్రల్లో మేటి అనిపించుకున్న ఘనుడు విజయ్ చందర్. తెలుగుతెరపై ఏసుక్రీస్తు జీవితాన్ని తొలిసారి…
ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ సైతం నటుడిగా మారిపోయాడు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించాడు సెల్వరాఘవన్. తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సెల్వ రాఘవన్ తమ్ముడు ధనుష్ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజానికి సెల్వ రాఘవన్ తాను నటుడిగా మారుతున్నట్టు గత యేడాది డిసెంబర్ లోనే ప్రకటించాడు. ‘రాకీ’ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న…