ఆసక్తికరమైన సినిమాలతో రాబోతున్న హీరో సుధీర్ బాబు 15వ చిత్రం షూటింగ్ ఆరంభం అయింది. నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఎం. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావుతో కలిసి శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇప్పటి వరకూ కనిపించనటువంటి పాత్రలో సుధీర్‌బాబుని ప్రెజెంట్ చేయడానికి హర్షవర్ధన్ భిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఈ వినూత్నమైన సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కి క్లాప్ కొట్టిన నిర్మాత పుస్కూర్ రామ్‌మోహన్‌రావు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Clicks from the Pooja Ceremony of Hero @isudheerbabu & Prestigious Banner @SVCLLP's #ProdNo5#Sudheer15 💥
— BA Raju's Team (@baraju_SuperHit) December 20, 2021
Presented by : Sonali Narang and Srishti
Clap by 🎬: #RamMohan
Shoot Begins next week !
Produced by: #NarayanDasNarang #PuskurRamMohanRao
Directed by : @HARSHAzoomout pic.twitter.com/oV5vVxJbFI