ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెగ్గేదెలే అన్నట్లుగా బాక్స్‌ఫీస్ వద్ద బ్లాక్ బస్టార్ హిట్ కొట్టి.. పాన్ ఇండియా వైడ్‌గా రికార్డుల వర్షం కురిపించింది పుష్ప ‘ది రైజ్’ సినిమా. అయితే ఈ సినిమాలో కథనాయికగా అభినయించి రష్మికకు కూడా నేషనల్ వైడ్‌గా ఫాలోయింగ్ మరింత పెరిగింది. అయితే.. ఈ సినిమా మొదటి భాగం రికార్డుల వర్షం కురిపించడంతో.. రెండో భాగం పుష్ప ‘ది రూల్’పై ప్రత్యేక దృష్టి సారించారు దర్శకుడు సుకుమార్.…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ ‘అల…వైకుంఠపురములో’ అయితే, సక్సెస్ తో పాటు బెస్ట్ పెర్ ఫార్మర్ గా బన్నీకి పేరు తెచ్చిన చిత్రం ‘పుష్ప : ద రైజ్’ అనే చెప్పాలి. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప: ద రూల్’ రాబోతోంది. తొలి భాగంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నటించిన ఫహద్ ఫాజిల్ కు పుష్ప పాత్రధారి అల్లు అర్జున్ బట్టలు ఊడతీయించి పంపుతాడు. ఆ తరువాత ఏమవుతుంది? అదే…
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ యాడ్ చేస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవి ఈ యాడ్ చేస్తున్నట్టు వారే స్వయంగా వెల్లడించారు కూడా. అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రసారం కానుంది. తాజాగా బయటకు వచ్చిన ఈ యాడ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.…
టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో సుకుమార్ ఒకడు. ఆయన దర్శకత్వంలో నటించాలని అగ్ర హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఇటీవల సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-1 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన పుష్ప-2 సినిమా ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఓ యాడ్ ఫిలింకు దర్శకత్వం వహించారు. శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ప్రకటనను తెరకెక్కించారు.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ చిత్రం రికార్డుల మోత మోగించింది. పుష్ప గా అల్లు అర్జున్ నటన కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాతో భారీ అంచనాలు రేకెత్తించిన సుకుమార్ పుష్ప పార్ట్ 2 తో మరింత అంచనాలు పెట్టుకొనేలా చేశాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్…
అభిమానం గుండెల్లో నుంచి వస్తుంది.. ఒక్కసారి ఒకరిని అభిమానించమంటే వదలడం చాలా కష్టం. ముఖ్యంగా తెలుగువారు ఒకరిని అభిమానించారంటే .. చచ్చిపోయేవరకు వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అయితే హీరోకు ఫ్యాన్స్ ఉండడం చూసి ఉంటాం.. హీరోయిన్స్‌కి ఫ్యాన్స్ ఉండడం చూసి ఉంటాం.. కానీ ఒక డైరెక్టర్ కి ఫ్యాన్స్ ఉండడం చాలా అరుదు.. అది ఇంతలా అభిమానించే ఒక అభిమాని ఉండడం నిజంగా అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన అభిమానిని సంపాదించుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ నేడు తన 52 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇక నేడు సుకుమార్ బర్త్ డే విషెస్ తో ట్విట్టర్ మారుమ్రోగిపోయింది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సుకుమార్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే ఆయనాతో కలిసి పనిచేసిన రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ వంటి హీరోలు లెక్కల మాస్టర్ కి తమదైన రీతిలో శుభాకాంక్షలు తెలుపగా.. ఇకముందు పనిచేసే హీరో విజయ్ దేవరకొండ అంతే స్పెషల్…
దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ గుబాళింపులతో ఆనందతీరాల్లో విహరిస్తున్నారు. జనం కోరేది మనం ఇవ్వాలి… మనం చేసేది జనం మెచ్చేలా ఉండాలి… ఈ సూత్రాన్ని తు.చ. తప్పక పాటిస్తారు సుకుమార్. ఆ సూత్రంతో పాటు, జనానికి ఎప్పుడు ఏ కథ చూపించాలి, ఏ సన్నివేశాన్ని ఎలా పండిస్తే రక్తి కడుతుంది అన్న సూత్రాలనూ అధ్యయనం చేసి సరైన లెక్కలు వేసుకొని, మరీ పక్కాగా సినిమాలు తెరకెక్కిస్తారాయన. అదే సుకుమార్ బాణీగా మారింది. దానికి జై కొట్టే జనం…
‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సుకుమార్ ..ప్రస్తుతం ‘పుష్ప’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సక్సెస్ సెలబ్రేషన్స్ ని ముగించుకున్న సుకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పేవరెట్ డైరెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు . సుకుమార్ కి నచ్చిన డైరెక్టర్ మణిరత్నం అని ఆయన చాలా స్టేజిలపై చెప్పారు. ఆయన సినిమాలను చూసే దర్శకత్వం వైపు వచ్చినట్లు కూడా తెలిపారు. అయితే ఆయనను కలిసే అవకాశం వచ్చినప్పుడు మణిరత్నం చేసిన పనికి…