Pushpa 2 : వచ్చే సంక్రాంతికి పుష్ప-2.. తగ్గేదెలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెగ్గేదెలే అన్నట్లుగా బాక్స్‌ఫీస్ వద్ద బ్లాక్ బస్టార్ హిట్ కొట్టి.. పాన్ ఇండియా వైడ్‌గా రికార్డుల వర్షం కురిపించింది పుష్ప ‘ది రైజ్’ సినిమా. అయితే ఈ సినిమాలో కథనాయికగా అభినయించి రష్మికకు కూడా నేషనల్ వైడ్‌గా ఫాలోయింగ్ మరింత పెరిగింది. అయితే.. ఈ సినిమా మొదటి భాగం రికార్డుల వర్షం కురిపించడంతో.. రెండో భాగం పుష్ప ‘ది రూల్’పై ప్రత్యేక దృష్టి సారించారు దర్శకుడు సుకుమార్. ఈ నేపథ్యంలోనే పార్టు 1కి మించి పార్టు 2 ఉండేలా స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారు. ఈ సారి సాధ్యమైనంత త్వరగా షూటింగును పూర్తి చేసేలా షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, 6 నెలల్లో అన్ని పనులను పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది చిత్రయూనిట్. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఈ సారి మరో హీరోయిన్ కి కూడా చోటు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఐటమ్ సాంగ్ లో దిశా పటాని కనిపించనుందనే వార్త వినిపిస్తోంది. అయితే ఈ సారి సంక్రాంతికి గట్టి పోటీనే ఉండనుంది. చిరంజీవి ‘భోళా శంకర్’ .. పవన్ ‘ హరి హర వీరమల్లు’ .. త్రివిక్రమ్ కాంబినేషన్ లోని మహేశ్ మూవీ సంక్రాంతి దిశగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ ను కూడా ఆ దిశగానే నడిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తించే విషయం.
Also Read
- The Traitors Telugu: "ది ట్రైటర్స్" తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
- Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
- Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!
- Renu Desai: 14 ఏళ్లుగా ఇదే పరిస్థితి.. నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?
తాజావార్తలు
-
CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Measles: గాల్లో వైరస్..30ఏళ్ల తర్వాత అదే ముప్పు!
-
Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
-
Minister Anam Ramanarayana Reddy: విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం తీవ్ర వ్యాఖ్యలు.. నా జోలికొస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా!
ట్రెండింగ్
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!