ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ చిత్రం రికార్డుల మోత మోగించింది. పుష్ప గా అల్లు అర్జున్ నటన కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాతో భారీ అంచనాలు రేకెత్తించిన సుకుమార్ పుష్ప పార్ట్ 2 తో మరింత అంచనాలు పెట్టుకొనేలా చేశాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టే పనిలో పడ్డారట మేకర్స్.
‘పుష్ప 2’ సినిమాకి సంబంధించిన కథా చర్చలు తమిళనాడులోని ‘కూనూర్’లో జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా లొకేషన్స్ కూడా వెతికే పనిలో ఉన్నారట. పుష్ప కన్నా పుష్ప 2 ఇంకా రసవత్తరంగా.. పోటాపోటీగా ఉండనున్నదట. అల్లు అర్జున్ కి ఫహద్ ఫజిల్ మధ్య సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి అని మేకర్స్ అంటున్నారు. ఇంకా పుష్ప 2 మొదలే కాలేదు పుష్ప 3 ని రంగంలోకి దింపేశారు నెటిజన్స్. అందుతున్న సమాచారం బట్టి పుష్ప 2 తోనే సినిమాను ఆపేయాలని అనుకోవడం లేదని, పుష్ప 3 కూడా తీయాలనుకుంటున్నాడట సుకుమార్. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అందుకు తగ్గట్టు కథను కూడా రెడీ చేసే పనిలో పడ్డాడట కూడా. ఇక ఇందుకు అల్లు అర్జున్ సైతం ఒప్పుకున్నాడని, కొద్దిగా మార్పులు చేర్పులు చేసి సరికొత్త కథతో పుష్ప 3 రానున్నదట. మరి ఇందులో నిజమెంత తెలియాలంటే సుకుమార్ నోరువిప్పాల్సిందే.