సోమవారం నుండి సినిమా షూటింగ్స్ బంద్ కావడంతో వరుసగా ఒక్కో శాఖతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రముఖులు, ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతలు, పంపిణీ దారులు, ఎగ్జిబిటర్స్ సమావేశం అవుతూ వస్తున్నారు. మంగళవారం డిజిటల్ ప్రొవైడర్స్ తో సమావేశం అయిన నిర్మాతలు, బుధవారం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గంతోనూ సంప్రదింపులు జరిపారు. అయితే ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ విషయంలో ‘మా’ సభ్యులు నిర్మాతలకు ఎలాంటి హామీ ఇవ్వనప్పటికీ, నిర్మాతల కష్టానష్టాలపై సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఇదే సమయంలో ‘మా’ అధ్యక్షుడు…
ఇటీవల కాలంలో సినిమాలు విడుదలై రెండువారాలకే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. అవి చిన్న సినిమాలు అయితే ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఏకంగా స్టార్ హీరోల సినిమాలకే ఇలా జరుగుతోంది. అయితే ఓటీటీలో పే ఫర్ వ్యూ లెక్కన రిలీజ్ చేస్తున్న ఈ సినిమాలకు సరైన స్పందన కూడా రావటం లేదన్నది వేరే సంగతి. అయితే ఈ ట్రెండ్ థియేటర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నది మెల్లమెల్లగా అందరికీ అర్థం అవుతోంది. అసలే స్టార్ హీరోల సినిమాలకు రేట్లు…
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపిండిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మే 27 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. దీంతో ప్రమోషన్ల జోరును పెంచేశారు చిత్ర బృందం. ఈ ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు ఒక ఆసక్తికరమైన విషయాన్నీ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ట్రిపుల్ ఆర్, ఆచార్య.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని.. అప్ కమింగ్ ప్రాజెక్ట్‌తో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడని భావించారు మెగా ఫ్యాన్స్. కానీ ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచినప్పటికీ.. ఆ వెంటనే వచ్చిన ఆచార్యతో భారీ ఫ్లాప్ అందుకున్నాడు చరణ్. దాంతో మెగా ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అందుకే చరణ్, శంకర్ ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా…
ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత ‘దిల్’ రాజును మించిన వారు లేరు. గత కొంతకాలంగా ఇటు తెలంగాణాలోనూ, అటు ఆంధ్రాలోనూ పెద్ద సినిమాలు విడుదలైతే చాలు ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని, సినిమా టిక్కెట్ రేట్లును నిర్మాతలు పెంచుకుంటున్నారు. ‘ట్రిపుల్ ఆర్’ లాంటి భారీ బడ్జెట్ మూవీ విషయంలో ఇది సమంజసమే కానీ ఇతర చిత్రాల టిక్కెట్ రేట్లనూ పెంచి అమ్మడం ఎంతవరకూ కరెక్ట్ అనే వాదన ఒకటి వచ్చింది. పాన్ ఇండియా సినిమాల…
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు, హరీష్ శంకర్ సంయుక్తంగా జీ5 కోసం రూపొందిస్తున్న వెబ్ సీరిస్ ‘ఏటీఎం’ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. బిగ్ బాస్ 5 ఫేమ్ సన్నీ, దివితో పాటు సుబ్బరాజు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నెల 27 నుండి దీని రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. ‘దిల్’ రాజు ఫ్యామిలీ నెక్ట్స్ జనరేషన్ కు చెందిన హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ వెబ్ సీరిస్ ను నిర్మిస్తున్నారు. సి.…
‘అన్నీ మంచి శకునములే’ అనే ఓల్డ్ సాంగ్ ను నేచురల్ స్టార్ నాని హ్యాపీగా హమ్ చేసుకోవచ్చు. ఈ మధ్య నాని సినిమాలు పెద్దంతగా బాక్సాఫీస్ దగ్గర హంగామా సృష్టించకపోయినా… అతని మీద తెలుగు ప్రేక్షకులకు ఉన్న ఆదరాభిమానాల్లో ఎలాంటి మార్పూ లేదు. అందుకు తాజాగా నిన్న విడుదలైన ‘అంటే సుందరానికీ…’ టీజర్ కు లభిస్తున్న ఆదరణను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ హవా ఇలా వీస్తుండగానే మరో రికార్డ్ ఒకటి నాని ఖాతాలో జమ అయ్యింది. నాని,…
తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు మంత్రి తలసానితో భేటీ అయ్యారు సినీ ప్రముఖులు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఎస్ ఎస్ రాజమౌళి, దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు సమావేశం నిర్వహిస్తున్నారు. సినిమారంగ సమస్యలు, టిక్కెట్ ధరల పెంపు, కరోనా మూడో దశ నేపథ్యంలో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింపుపై జరుగుతున్న ప్రచారంపై చర్చించనున్నారు. అంతేకాకుండా సినిమా షూటింగ్లు ఎలా…