Tollywood producers guild committee : సమస్యల పరిష్కారానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ కమిటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood producers guild committee:
యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు 1 నుండి షూటింగ్‌లను నిలిపివేయాలని మంగళవారం అధికారికంగా నిర్ణయించింది. కారణంగా నిర్మాణ వ్యయం పెరగటం… అందు మూలంగా నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించింది. ఇక తమ సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనడానికి గిల్డ్ కమిటీలను నియమించింది. అందులో భాగంగా థియేట్రికల్, ఎగ్జిబిషన్ సమస్యలపై చర్చించడానికి దిల్ రాజు కన్వీనర్ గా సుధాకర్ రెడ్డి, యువి వంశీ, వీరినాయుడు, బన్నీవాసు, సాయిబాబు అన్నపూర్ణ, రామ్ మోహన్, ఎన్వీ ప్రసాద్ తో ఓ కమిటి వేసింది. అలాగే ఓటీటీ హోల్డ్ బ్యాక్ పై చర్చకు బాపినీడు కన్వీనర్ గా ఏఎం రత్నం, పి.కిరణ్, మైత్రీ రవి, యువి వంశీ, శరత్ సభ్యులుగా ఇక ప్రొడక్షన్ కాస్ట్ సమస్యలపై చర్చించేందుకు వివేక్ కూచిభొట్ల కన్వీనర్ గా నాగవంశీ, రవికిశోర్, శివలెంక కృష్ణప్రసాద్, మధు, కిషోర్, రాధామోహన్, 14 రీల్స్ గోపి, బెక్కం వేణు గోపాల్, చిట్టూరి శ్రీనివాస్, సుధాకర్ చెరుకూరి, దామోదర్ ప్రసాద్, సాహు గారపాటి, అనురాగ్ పర్వతనేనితో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీలన్నీ ఆ యా సమస్యలపై చర్చించి, సాధ్యమైన మేరకు పరిష్కారాలను వెతికే ప్రయత్నం చేస్తాయి. అప్పటి వరకు షూటింగ్‌లను ఆపటానికి నిర్ణయం తీసుకుంది గిల్డ్. మరి ఈ కమిటీలు త్వరగా తగిన పరిష్కారాలను కనుగొని వీలయినంత త్వరగా షూటింగ్ లు ఆరంభించేలా చేస్తాయని ఆశిద్దాం.
Also Read
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!