మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ట్రిపుల్ ఆర్, ఆచార్య.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని.. అప్ కమింగ్ ప్రాజెక్ట్‌తో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడని భావించారు మెగా ఫ్యాన్స్. కానీ ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచినప్పటికీ.. ఆ వెంటనే వచ్చిన ఆచార్యతో భారీ ఫ్లాప్ అందుకున్నాడు చరణ్. దాంతో మెగా ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అందుకే చరణ్, శంకర్ ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తోనే తెరకెక్కుతోంది. దాంతో చాలా రోజుల నుంచి చరణ్ ఫస్ట్ లుక్ అండ్.. టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతోందని వినిపిస్తోంది. శంకర్ కూడా ఎప్పుడో ఈ సినిమా ఫస్ట్ లుక్ రెడీ చేశాడని.. ఇక రిలీజ్ చేయడమే ఆలస్యమని.. గతంలో వార్తలొచ్చాయి. దాంతో ఈ మధ్యన ఈ బిగ్ అప్టేట్ రావడం ఖాయమనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్.
ఈ నేపథ్యంలో.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. దిల్ రాజు బ్యానర్లో వస్తున్న ఎఫ్ 3 మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు దిల్ రాజు. ఇలాంటి సమయంలో హడావిడిగా ఆర్సీ 15 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమెందుకని అనుకున్నారట. అందుకే ఎఫ్3 థియేటర్లలోకి రాగానే.. చరణ్, శంకర్ టైటిల్ ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. పైగా ఎఫ్ 3 ఫన్ బ్లాస్ట్‌గా నిలవబోతోందని.. హిట్ ఖాయమని చెబుతున్నారు. దాంతో ఆ సక్సెస్ జోష్‌లో RC15 ఫస్ట్ లుక్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. ఇక ఈ సినిమాకు’సర్కారోడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కియరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఎఫ్ 3 రిలీజ్ తర్వాత.. ఆర్సీ 15 టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందేమో చూడాలి.