పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఈ నెల 16వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీగా కొనుగోలు చేసి విడుదలకు సిద్ధం అయ్యారు. దాదాపు 185 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఖర్చు చేసి ఈ సినిమా ను పీపుల్స్ మీడియా వారు కొనుగోలు చేశారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమా యొక్క తెలుగు రైట్స్ ని దిల్ రాజుకి అమ్మేందుకు నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారని తెలుస్తుంది.. కానీ దిల్ రాజు మాత్రం ఆసక్తి చూపించలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ కూడా జరుగుతుంది. కనీసం నైజాం ఏరియా లేదా ఏపీ లో ఏదో ఒక ఏరియా లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తే సినిమా పై జనాల్లో ఆసక్తి కలుగుతుందని అంతా కూడా భావించారు. కానీ దిల్ రాజు మాత్రం ఈ సినిమా పట్ల అంతగా ఆసక్తి చూపించలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
చిత్ర యూనిట్ సభ్యులు అసలు దిల్ రాజు ను సంప్రదించారా లేదా అనేది క్లారిటీ అయితే లేదు. కానీ మీడియా లో మాత్రం ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు అయితే ప్రచారం చేసేస్తున్నారు. దిల్ రాజుకు ఈ సినిమా పట్ల నమ్మకం లేదా అంటూ జోరుగా చర్చలు కూడా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎంత వరకు సినిమా వసూలు చేయగలుగుతుంది అనేది అందరికీ కూడా ఆసక్తిగా మారింది.. దిల్ రాజు చేతి లో ఈ సినిమా పడి ఉంటే ఎక్కువ థియేటర్లలో విడుదల అయ్యి ఉండేదని లేదంటే అదనపు పబ్లిసిటీ కూడా దక్కేది. కానీ దిల్ రాజు ఈ సినిమా విషయం లో అంతగా నమ్మకం తో లేడంటూ సోషల్ మీడియా లో చర్చ కూడా జరుగుతుంది. అయితే కొందరు మాత్రం ప్రస్తుతం తాను నిర్మిస్తున్న సినిమా లపై ఎక్కువ దృష్టి పెట్టి ఉన్నాడు కనుక ముందు ఆ సినిమా లకు ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశం తో ఇలాంటి భారీ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి రిస్క్ తీసుకోవాలని భావించలేదు అంటూ కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ రావాలి అంటే దిల్ రాజు స్వయంగా చెప్పాలని తెలుస్తుంది.